- Telugu News Photo Gallery Cricket photos IND vs ENG, T20 World Cup 2024: Virat Kohli Performance In Previous T20 World Cup Semifinals
IND vs ENG: మరికొన్నిగంటల్లో సెమీస్.. అదే జరిగితే కింగ్ కోహ్లీ చేతిలో ఇంగ్లిష్ బౌలర్లకు దబిడి దిబిడే!
9వ టీ20 ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్ జట్టుతో తలపడుతోంది. 11 ఏళ్లుగా ఐసీసీ కప్ అందుకోలేక సతమతమవుతున్న టీమ్ ఇండియాకు ఇది మరో సువర్ణావకాశం.
Updated on: Jun 27, 2024 | 5:31 PM

9వ టీ20 ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్ జట్టుతో తలపడుతోంది. 11 ఏళ్లుగా ఐసీసీ కప్ అందుకోలేక సతమతమవుతున్న టీమ్ ఇండియాకు ఇది మరో సువర్ణావకాశం.

అయితే ఇంతటి ముఖ్యమైన మ్యాచ్‌కి ముందు టీమిండియా ఓపెనింగ్ జోడీ పేలవమైన ఫామ్ తో సతమతమవుతోంది. గత మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడినా విరాట్ కోహ్లీ ఇంకా ఫామ్‌లోకి రాలేదు. దీంతో మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి నెలకొంది. ఈరోజు భారత్ గెలవాలంటే కోహ్లి బ్యాట్‌తో మెరవాల్సి ఉంది.

అయితే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు మూడు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఈ టీ20 ప్రపంచకప్‌లో కింగ్ కోహ్లీ పెద్దగా రాణించట్లేదు. అతని బ్యాట్ నుంచి ఒక్క ఇన్నింగ్స్‌లోనూ 50 పరుగులు రాలేదు. దీంతో పాటు రెండు సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. గతంలో ఐసీసీ టోర్నీల్లో కోహ్లీ ఎప్పుడూ ఇంత పేలవ ప్రదర్శన చేయలేదు.

2022 టీ20 ప్రపంచకప్ సెమీస్ లో టీమిండియా ఇంగ్లండ్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 40 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయినప్పటికీ భారత జట్టు ఓటమి పాలైంది.

2014లో తొలిసారి సెమీఫైనల్ ఆడిన కోహ్లి.. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.

2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీస్ లో భాగంగా వెస్టిండీస్‌పై కోహ్లీ 47 బంతుల్లో 89 పరుగులతో మరో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది.





























