T20 World Cup 2022: టీమిండియా టీ20 ప్రపంచకప్ సన్నాహాలు పూర్తి.. జట్టు బ్యాలెన్స్ ఒక్కటే పెండింగ్: ద్రవిడ్
Indian Cricket Team: పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు రెండు క్వాలిఫయర్లతో పాటు సూపర్ 12లో భారత్ గ్రూప్-2లో ఉంది. మొత్తం టోర్నీలో భారత్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి మ్యాచ్ అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో..
T20 World Cup 2022: ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. 2021 ప్రపంచకప్‌లో భారత జట్టు(Indian Cricket Team)కు విరాట్ కోహ్లీ(Virat Kohli) కెప్టెన్‌గా వ్యవహరించగా, రవిశాస్త్రి కోచ్‌గా వ్యవహరించాడు. ఆ జట్టు సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. ప్రస్తుతం టీమిండియాలో భారీ మార్పులు వచ్చాయి. జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma) ఎంపిక కాగా, రాహుల్ ద్రవిడ్ కొత్త కోచ్‌గా నియమితుడయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 తర్వాత మీడియా సమావేశంలో కోచ్ ద్రవిడ్ కూడా ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ గురించి కీలక విషయాలు వెల్లడించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం ద్రవిడ్ మాట్లాడుతూ- సెలెక్టర్లతోపాటు నాకు, రోహిత్‌కు ప్రపంచ కప్‌ల కలయిక గురించి చాలా ఆలోచనలున్నాయి. అయితే అందరి చూపు స్థిరమైన జట్టును నెలకొల్పడంపైనే నిలిచింది. ప్రత్యేకించి ఫార్ములా అంటూ ఏంలేదు. కానీ, టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించిన కూర్పులు, సమతుల్యత గురించి మే: చాలా స్పష్టంగా ఉన్నాం. దీనిపైనే జట్టును నిర్మిస్తాం. ఆటగాళ్ల పనిభారాన్ని సమతుల్యం చేస్తున్నాం’ అని తెలిపాడు.
బ్యాకప్‌ను కలిగి ఉండటం చాలా కీలకం.. భారత ప్రధాన కోచ్ ఇంకా మాట్లాడుతూ – కేవలం 15 మంది ఆటగాళ్లకే పరిమితం కాకూడదనుకుంటున్నాం. క్రీడాకారులకు అవకాశాలు కల్పించాలన్నారు. మేం ప్రపంచ కప్ ఆడటానికి వెళ్ళే సమయానికి మా ఆటగాళ్లలో కొందరికి కనీసం 10 నుంచి 20 మ్యాచ్‌ల అనుభవం ఉండేలా చూసుకోవాలి. ఇది రోహిత్‌కి అతని జోడీతో కలిసి ఆడే అవకాశాన్ని ఇస్తుంది. బౌలింగ్‌లోనూ ఇదే అనుసరిస్తున్నాం. అయితే ఒక ఆటగాడు గాయపడిన సందర్భంలో సమతుల్యతను కాపాడుకోవడానికి మాకు కొంత ‘బ్యాకప్’ కూడా అవసరం’ అని పేర్కొన్నాడు.
వెంకటేష్ అయ్యర్.. “ఐపీఎల్ ఫ్రాంచైజీలో వెంకటేష్ అయ్యార్ ఓపెనర్ పాత్ర పోషిస్తాడని మాకు తెలుసు. అయితే అతని పరిస్థితిని బట్టి అతనికి ఎలాంటి పాత్ర ఇవ్వాలనుకుంటున్నామో మా అభిప్రాయం స్పష్టంగా ఉంది. మాకు మొదటి మూడు స్థానాల్లో ఖాళీ లేదు. కాబట్టి మేం అతని ముందు ఒక సవాలు ఉంచాం. మేం అతనికి ఒక పాత్రను కేటాయించాం. ఈ పాత్రలోనూ తన సత్తా చాటాడు. దీంతో మా శ్రమకు తగిన ఫలితం లభించనట్లైంది’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
వెస్టిండీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌లలో వెంకటేష్ 184 స్ట్రైక్ రేట్‌తో 92 పరుగులు చేసి 2 వికెట్లు తీయగలిగాడు. చివరి మ్యాచ్‌లో అయ్యర్ 19 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అక్టోబర్ 16 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం.. టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కాగా, ఫైనల్ నవంబర్ 13న మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. టోర్నీలో అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలోని 7 వేర్వేరు నగరాల్లో మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి.
పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు రెండు క్వాలిఫయర్లతో పాటు సూపర్ 12లో భారత్ గ్రూప్-2లో ఉంది. మొత్తం టోర్నీలో భారత్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి మ్యాచ్ అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో, రెండో మ్యాచ్ అక్టోబర్ 27న గ్రూప్-ఏ రన్నరప్‌తో, మూడో మ్యాచ్ అక్టోబర్ 30న దక్షిణాఫ్రికాతో, నాలుగో మ్యాచ్ నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో, 5వ మ్యాచ్ నవంబర్ 6న గ్రూప్ బిలో తొలి స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది.