AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అక్షర్, దిస్ ఈజ్ టూ మచ్.. ధోని చూస్తే సిగ్గుతో తల దించుకుంటాడు: రోహిత్ శర్మ

Rohit Sharma: టీం ఇండియా క్రికెటర్ల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వాటిని చూస్తే కచ్చితంగా నవ్వకుండా ఉండలేం. కొన్ని వీడియోలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. భారత జట్టులోని ఆటగాళ్లందరూ మైదానంలో చాలా సీరియస్‌గా కనిపిస్తారు. ఎందుకంటే, వారు మ్యాచ్ గెలవాలనే ఒత్తిడిలో ఉంటారు. కానీ, మైదానం వెలుపల వారి శైలి భిన్నంగా ఉంటుంది.

Video: అక్షర్, దిస్ ఈజ్ టూ మచ్.. ధోని చూస్తే సిగ్గుతో తల దించుకుంటాడు: రోహిత్ శర్మ
Rohit Sharma Axar Patel
Venkata Chari
|

Updated on: Oct 04, 2024 | 12:05 PM

Share

Rohit Sharma: టీం ఇండియా క్రికెటర్ల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వాటిని చూస్తే కచ్చితంగా నవ్వకుండా ఉండలేం. కొన్ని వీడియోలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. భారత జట్టులోని ఆటగాళ్లందరూ మైదానంలో చాలా సీరియస్‌గా కనిపిస్తారు. ఎందుకంటే, వారు మ్యాచ్ గెలవాలనే ఒత్తిడిలో ఉంటారు. కానీ, మైదానం వెలుపల వారి శైలి భిన్నంగా ఉంటుంది. భారత జట్టు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో అతను తన తోటి ఆటగాళ్లను అనుకరిస్తూ కనిపిస్తుంటాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మైదానం వెలుపల చాలా సరదాగా గడుపుతున్నాడు. రోహిత్‌కి సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో, టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అతన్ని జట్టులోని అత్యంత చిలిపి క్రికెటర్ అంటూ పిలిస్తుంటాడు. కాగా, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా ఆటగాళ్లు కొందరు పాల్గొన్నారు. ఇందులో రోహిత్ శర్మ చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అయితే, ఈ షోలో రోహిత్‌కి కూడా ఒక టాస్క్ వచ్చింది. అది చాలా సరదాగా ఉంది.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో రెండో సీజన్..

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో రెండో సీజన్ ప్రారంభమైంది. దాని రెండు ఎపిసోడ్‌లు కూడా ప్రసారం అయ్యాయి. మూడో ఎపిసోడ్ శనివారం ప్రసారం కానుంది. ఇందులో భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ కనిపించబోతున్నారు. శనివారం వస్తున్న ఈ షోకి సంబంధించిన ప్రివ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో క్రికెటర్లందరూ సరదాగా గడుపుతున్నారు.

ధోనీ ఐకానిక్ మూమెంట్..

వాస్తవానికి, టాస్క్‌లో అక్షర్ పటేల్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌ను అనుకరించాల్సి ఉంది. రోహిత్ శర్మ ఆ మిమిక్రీని గుర్తించి సరైన క్రికెటర్ పేరు చెప్పాల్సి ఉంటుంది. దీని కోసం అక్షర్ పటేల్ 2011 వరల్డ్ కప్ గెలిచిన ధోని సిక్సర్‌ని గుర్తు చేసేలా ప్రయత్నించాడు. అయితే, అది విఫలమైంది. కానీ, రోహిత్ దానిని గుర్తించలేదు. అందరూ ఇలాగే సిక్స్ కొడతారంటూ చెప్పుకొచ్చాడు. ఇంతలో సూర్యకుమార్ యాదవ్ కల్పించుకుని, ధోనిలాగా నటించాడు. రోహిత్ శర్మకు హింట్ ఇచ్చాడు. సూర్య అచ్చం ధోనిలా హెలికాప్టర్ షాట్ కొట్టాడు. దీంతో రోహిత్ శర్మ వెంటనే ధోని పేరును తీసుకున్నాడు. హెలికాప్టర్‌ షాట్ కొడితేనే అర్థమవుతుందంటూ అక్షర్‌ను ఏకిపారేశాడు. రోహిత్ శర్మకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..