Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs KKR Tickets: ఉప్పల్‌లో ఫేక్‌ టిక్కెట్స్‌ కలకలం.. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు..

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచుల్లో ఫేక్ టికెట్స్ కలకలం రేగడంతో రాచకొండ పోలీసుల స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈమేరకు బీసీసీఐ జారీ చేసిన అక్రిడేషన్ కార్డ్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు.

SRH vs KKR Tickets: ఉప్పల్‌లో ఫేక్‌ టిక్కెట్స్‌ కలకలం.. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు..
Uppal Stadium
Follow us
Venkata Chari

|

Updated on: May 04, 2023 | 4:42 PM

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచుల్లో ఫేక్ టికెట్స్ కలకలం రేగడంతో రాచకొండ పోలీసుల స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈమేరకు బీసీసీఐ జారీ చేసిన అక్రిడేషన్ కార్డ్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు. టికెట్స్, కార్డ్స్ స్కానింగ్ మెషీన్ల వద్ద భద్రతను మరింత పెంచారు. గత మ్యాచుల్లో బార్ కోడ్స్ కాపీ చేసి.. ఫేక్ టికెట్స్ తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫేక్ టికెట్స్ గ్యాంగ్ ని పట్టుకున్న రాచకొండ పోలీసులు.. అందులో ఆరుగుర్ని అరెస్ట్ చేశారు.

మరోవైపు హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ సందడి నెలకొంది. ఈరోజు సాయంత్రం 7.30కి సన్‌రైజర్స్‌ వర్సెస్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కీలక మ్యాచ్ జరగనుంది.  ఇరుజట్లు ప్లే ఆఫ్‌లో నిలవాలంటే.. ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిందే.

పాయింట్లపట్టికలో 8వ స్థానంలో ఉన్న కోల్‌కత్తా, 9వ స్థానంలో ఉన్న హైదరాబాద్ టీంతో తలపడుతోంది. ఉప్పల్ వేదికగా ఆడిన 4 మ్యాచ్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే SRH విజయం సాధించింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న హైదరాబాద్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ని హైదరాబాద్ టీం తీవ్ర నిరాశపరిచింది. డూ ఆర్‌ డై మ్యాచ్‌లో SRH తప్పక గెలవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..