Ind vs Pak: కీలక సమయంలో క్యాచ్ నేలపాలు.. టీమిండియా యంగ్ పేసర్‌కు సపోర్టుగా నిలిచిన పాక్ మాజీ క్రికెటర్
Ind Vs Pak, Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీ సూపర్-4 రౌండ్‌లో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అనూహ్య రీతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకట్టుకున్నా.. బౌలర్లు విఫలం కావడంతో
Ind Vs Pak, Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీ సూపర్-4 రౌండ్‌లో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అనూహ్య రీతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకట్టుకున్నా.. బౌలర్లు విఫలం కావడంతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు పరాభవం తప్పలేదు. దీనికి తోడు ఫీల్డింగ్ వైఫల్యం కూడా పాక్‌కు వరంగా మారింది. ముఖ్యంగా18వ ఓవర్లో రవి బిష్ణోయి బౌలింగ్‌లో అసిఫ్ అలీ ఇచ్చిన సులవైన క్యాచ్‌ను అర్ష్‌దీప్ జారవిడిచాడు. ఆ తర్వాత రెచ్చిపోయిన అసిఫ్ పాక్‌ను విజయ తీరానికి చేర్చుకోవాడు. ఇదిలా ఉంటే కీలక సమయంలో క్యాచ్ నేలపాలు చేసిన అర్ష్‌దీప్‌పై రోహిత్ శర్మ మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను తిట్టిపోస్తున్నారు.
ఇవి కూడా చదవండి— Guess Karo (@KuchNahiUkhada) September 5, 2022
ఇదిలా ఉంటే మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ హఫీజ్ తదితరులు అర్ష్‌దీప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అర్షదీప్‌ను విమర్శించడమ మానేయండి. ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్‌లు విడిచిపెట్టరు..భారత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. వారిని చూసి మేం గర్విస్తున్నాం. ఇక పాకిస్థాన్ మన కన్నా మెరుగ్గా ఆడింది. చౌకబారు మాటలతో అర్ష్‌ను, భారత జట్టును నిందించే వాళ్లు సిగ్గుపడాలి’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు భజ్జీ. ‘భారత జట్టు అభిమానులందరికీ నా విన్నపం. మనం మనుషులం. ఆటల్లో అందరూ తప్పులు చేస్తాం. అంతమాత్రాన వారిని కించపరచాల్సిన అవసరం లేదు’ హఫీజ్ అర్ష్‌కు మద్దతుగా నిలిచాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ అయితే ‘అర్ష్‌దీప్ స్ట్రాంగ్ ప్లేయర్’ అని మద్దతుగా నిలిచాడు.
Stop criticising young @arshdeepsinghh No one drop the catch purposely..we are proud of our ?? boys .. Pakistan played better.. shame on such people who r putting our own guys down by saying cheap things on this platform bout arsh and team.. Arsh is GOLD??
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 4, 2022
My request to all Indian team fans. In sports we make mistakes as we r human. Please don’t humiliate anyone on these mistakes. @arshdeepsinghh
— Mohammad Hafeez (@MHafeez22) September 4, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..