ENG vs SL: వన్డేల్లో చెత్త రికార్డును సొంతం చేసుకున్న లంకేయులు..! కలిసి రాని ఇంగ్లండ్ పర్యటన
శ్రీలంక టీం ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో లంకేయులకు ఏదీ కలిసిరావడంలేదు. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన ఆ టీం తాజాగా వన్డే సిరీస్ ను కూడా చేజార్చుకుంది.
ENG vs SL: శ్రీలంక టీం ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో లంకేయులకు ఏదీ కలిసిరావడంలేదు. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన ఆ టీం తాజాగా వన్డే సిరీస్ ను కూడా పోగొట్టుకుంది. అయితే తాజాగా జరిగిన రెండో వన్డేలో ఆ టీం ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మొదటి వన్డేలో ఘోరంగా ఓడిపోయిన ఫెరీరా టీం.. నిన్న జరిగిన రెండో వన్డేలోనూ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇంగ్లండ్ 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. తాజా వన్డే ఓటమితో శ్రీలంక టీం క్రికెట్ చరిత్రలో అత్యధిక ఓటములు సాధించిన జట్టుగా నిలిచింది. మరోవైపు బయో బబుల్ రూల్స పాటించనందుకు ముగ్గురు శ్రీలంక ప్లేయర్లను వన్డే నుంచి తప్పించి, స్వదేశానికి రప్పించిన సంతగి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ పర్యటనలో మొత్తం చేదు అనుభవాలను మిగుల్చుకుంది లంక టీం.
శ్రీలంక టీం ఇప్పటి వరకు 860 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 390 విజయాలు సాధించగా, 428 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో 5 మ్యాచ్‌లు టై అయ్యాయి. 37 మ్యాచుల్లో ఫలితం రాలేదు. అత్యధికంగా వన్డేలు ఓడిన జట్టుగా ఇన్నాళ్లు భారత్ తో కలిసి శ్రీలంక జట్టు ఉమ్మడిగా నిలిచాయి. తాజా ఓటమితో శ్రీలంక తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 427 పరాజయాలతో టీమిండయా నిలిచింది. వన్డే క్రికెట్‌లోనే అత్యధికంగా మ్యాచులు ఆడిన రికార్డు మాత్రం టీమిండియా పేరుతోనే ఉంది. ఇప్పటి వరకు టీమిండియా 993 మ్యాచ్‌లు ఆడింది. 516 విజయాలు సాధించగా, 9 మ్యాచ్‌లు టై అవ్వగా, మరో 41 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా టీం కొనసాగుతోంది. ఆసీస్ జట్టు 955 మ్యాచ్‌లు ఆడగా, 579 మ్యాచుల్లో గెలుపొందింది. ఈ టీం 333 మ్యాచ్‌ల్లో ఓడిపోగా… 9 మ్యాచ్‌లు టై చేసుకుంది. మరో 34 మ్యాచ్‌ల్లో మాత్రం ఫలితం రాలేదు.
Also Read:
WI vs SA: కార్ట్ వీల్ తో అలరించిన యూనివర్సల్ బాస్..! వైరలవుతోన్న వీడియో