IPL 2021: మూడు అర్ధ శతకాలు.. ఓ డబుల్ సెంచరీ.. ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఐపీఎల్‌ టీమ్స్ కన్ను.!

ఆ యువ ఆటగాడు అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌..

IPL 2021: మూడు అర్ధ శతకాలు.. ఓ డబుల్ సెంచరీ.. ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఐపీఎల్‌ టీమ్స్ కన్ను.!
Conway
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 02, 2021 | 1:07 PM

IPL 2021 Auction: ఆ యువ ఆటగాడు అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి టెస్టులో డబుల్ సెంచరీ.. వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో అర్ధ శతకాలు సాధించి ర్యాంకింగ్‌లో దూసుకుపోతున్నాడు. అతడెవరో కాదు.! న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ డెవాన్ కాన్‌వే.

కివిస్ బ్యాటింగ్ విభాగంలో కీలక ఆటగాడిగా మారిన కాన్‌వే.. అక్టోబర్‌లో యూఏఈ వేదికగా జరగబోయే ఐపీఎల్ సెకండాఫ్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లకు సంబంధించిన పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ సెకండ్ సీజన్‌కు దూరం కానున్న నేపధ్యంలో మూడు టీమ్స్ కాన్‌వేను తీసుకోవాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి.

వరుస ఓటములతో దెబ్బతిన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు యాజమాన్యం.. ఎక్స్‌ట్రా ఓపెనర్‌గా జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తోంది. అలాగే రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీలు కూడా ట్రై చేస్తున్నాయి. కాగా, కాన్‌వే తాజాగా ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో దుమ్ములేపుతున్నారు. వరుసగా చక్కటి ప్రదర్శనలు కనబరుస్తూ విజయాల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు. మరి చూడాలి అతడ్ని ఐపీఎల్‌లో ఏ టీమ్‌ దక్కించుకుంటుందో.!

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!

రెస్టారెంట్‌ను పేల్చేస్తానంటూ కస్టమర్ ఫోన్.. కారణం ఆరా తీయగా మైండ్ బ్లాంక్.!