AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonal Dinusha: 44 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక బ్యాటర్ సోనాల్ దినుషా

Sonal Dinusha: టీమిండియాపై వరుసగా తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించి శ్రీలంక యువ బ్యాటర్ సోనాల్ దినుషా చరిత్ర సృష్టించాడు. 44 ఏళ్ల క్రితం దులీప్ మెండిస్ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. కొలంబో టెస్టులో 103 పరుగులతో మెరిసిన దినుషా, 2026లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Sonal Dinusha: 44 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక బ్యాటర్ సోనాల్ దినుషా
Sonal Dinusha
Rakesh
|

Updated on: Aug 26, 2026 | 12:15 PM

Share

Sonal Dinusha: శ్రీలంక యువ బ్యాటర్ సోనాల్ దినుషా భారత జట్టుపై అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 103 పరుగులతో సెంచరీ బాది, టీమిండియాపై తన తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన రెండో శ్రీలంక ఆటగాడిగా 44 ఏళ్ల నాటి రికార్డును సమం చేశాడు. టీమిండియా బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సోనాల్ దినుషా టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖించాడు. తన కెరీర్‌లో భారత్‌పై ఆడిన తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు 1982లో శ్రీలంక దిగ్గజ ఆటగాడు దులీప్ మెండిస్ మాత్రమే ఈ సాధన చేశాడు. సుదీర్ఘమైన 44 సంవత్సరాల విరామం తర్వాత ఆ ఘనతను సాధించిన రెండో లంక ఆటగాడిగా దినుషా రికార్డులకెక్కాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్‌పై తమ తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన ఎనిమిదో బ్యాటర్‌గా కూడా నిలిచాడు.

మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతమైన పోరాటం

ఈ సిరీస్‌లో దినుషా బ్యాటింగ్ శైలి భారత బౌలర్లకు పెద్ద సవాలుగా మారింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేసిన ఆయన, తర్వాతి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇప్పుడు కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులతో మరో శతకాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో 95.67 అద్భుతమైన సగటుతో ఏకంగా 287 పరుగులు సాధించి తన సత్తా చాటాడు.

ఇది కూడా చదవండి:Cricket Discipline: జైస్వాల్, వైభవ్‎లకు కఠిన శిక్ష పడాల్సిందే.. ఐసీసీ, బీసీసీఐలపై మాజీ క్రికెటర్ మండిపాటు

దిగ్గజాల సరసన స్థానం

టీమిండియాపై వరుస టెస్టుల్లో సెంచరీలు బాదిన ఏడో శ్రీలంక బ్యాటర్‌గా సోనాల్ దినుషా నిలిచాడు. గతంలో అరవింద డిసిల్వా, కుమార్ సంగక్కర లాంటి దిగ్గజాలు వరుసగా మూడు టెస్టుల్లో భారత్‌పై సెంచరీలు సాధించగా, సనత్ జయసూర్య, మహేళ జయవర్ధనే, తరంగ పరణవితాన, ఎంజెలో మాథ్యూస్ రెండు టెస్టుల్లో ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వారందరి సరసన దినుషా స గర్వంగా చేరిపోయాడు.

ఇది కూడా చదవండి:Virat Kohli: 6-7 సెలబ్రేషన్‌తో ఫేమస్.. ఇప్పుడు విరాట్ కోహ్లీనే ఫాలో అవ్వమంటున్న వైరల్ గర్ల్

2026 నాటి అగ్ర శ్రేణి బ్యాటర్

ప్రస్తుత 2026 సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో దినుషా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో 77 సగటుతో 462 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన అంతర్జాతీయ బ్యాటర్లలో అత్యుత్తమ సగటు కలిగిన ఆటగాడిగా దినుషా నిలవడం ఆయన నిలకడైన ప్రతిభకు నిదర్శనం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!
తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..?
తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..?
రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు.. భారత్‌పై 100% టారిఫ్ ముప్పు!
రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు.. భారత్‌పై 100% టారిఫ్ ముప్పు!
తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: జేసన్ సంజయ్
తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: జేసన్ సంజయ్
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఆఖరి టీ20లోనూ వైభవ్‌కి నిరాశేనా.. శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..?
ఆఖరి టీ20లోనూ వైభవ్‌కి నిరాశేనా.. శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..?
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఒకేసారి రూ.25 లక్షలు..!
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఒకేసారి రూ.25 లక్షలు..!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. రైల్వే JE పరీక్ష తేదీలు వచ్చేశాయ్!
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..
TG SET 2026 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?
TG SET 2026 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. ఇంతకీ ఎప్పుడంటే?