SRH vs CSK Highlights, ఐపీఎల్ 2024: హైదరాబాద్‌దే విజయం.. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన చెన్నై..
Sunrisers Hyderabad vs Chennai Super Kings, ఐపీఎల్Highlights: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య IPL 2024లో భాగంగా 18వ మ్యాచ్ జరుగుతోంది. పాట్ కమిన్స్ సేనతో ఢీకొట్టేందుకు రుతురాజ్ గైక్వాడ్ సేన సిద్ధమైంది.

Sunrisers Hyderabad vs Chennai Super Kings, ఐపీఎల్ Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన సొంత మైదానంలో వరుసగా రెండో విజయం సాధించింది. ఈ సీజన్‌లోని 18వ మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ని ఓడించింది. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో చెన్నై మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 (ఐపీఎల్) 18వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. శివమ్ దూబే 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, అజింక్య రహానే 35 పరుగులు చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్ తలో వికెట్ తీశారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య IPL 2024లో భాగంగా 18వ మ్యాచ్ జరుగుతోంది. పాట్ కమిన్స్ సేనతో ఢీకొట్టేందుకు రుతురాజ్ గైక్వాడ్ సేన సిద్ధమైంది. ఎందుకంటే ఇరు జట్లు పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాయి. గత మ్యాచ్‌లో ఇరుజట్లు ఓడిపోయి వస్తున్నాయి.
ఉప్పల్‌లో ఇరుజట్ల రికార్డులు..
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇరు జట్ల రికార్డులు సమంగా ఉన్నాయి. SRH, CSK మధ్య ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 4 మ్యాచ్‌లు జరిగాయి. హైదరాబాద్ 2 గెలుపొందగా, చెన్నై కూడా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
చెన్నైదే పైచేయి..
ఓవరాల్‌గా ఇరుజట్ల పోరులో చెన్నై ముందంజలో ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు హైదరాబాద్, చెన్నై మధ్య 19 మ్యాచ్‌లు జరిగాయి. హైదరాబాద్‌లో 5, చెన్నైలో 14 గెలిచాయి. అంటే హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నై 74% విజయం సాధించింది.
ఇరు జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
చెన్నై సూపర్ కింగ్స్: శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరి.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి.
Key Events
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
LIVE Cricket Score & Updates
-
హైదరాబాద్ విజయం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన సొంత మైదానంలో వరుసగా రెండో విజయం సాధించింది. ఈ సీజన్‌లోని 18వ మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ని ఓడించింది. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో చెన్నై మూడో స్థానంలో కొనసాగుతోంది.
-
4వ వికెట్ డౌన్..
హైదరాబాద్ 15.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ 18 పరుగులు వద్ద ఎల్బీగా పెవిలియన్ చేరాడు. హెన్రిచ్ క్లాసెన్ (1) క్రీజులో ఉన్నాడు.
-
-
3 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్..
హైదరాబాద్ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నారు.
-
ట్రావిస్ హెడ్ ఔట్..
ఇంపాక్ట్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ 31 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతను మహిష్ తిక్షణ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు.
-
100 పరుగులు హైదరాబాద్ స్కోర్..
9వ ఓవర్లో హైదరాబాద్ 100 పరుగుల మార్కును దాటింది. అదే ఓవర్లో హెడ్, మార్క్రామ్ కూడా యాభై పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. ఈ ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 101 పరుగులు.
-
-
పవర్ ప్లేలో పవర్ చూపించిన హైదరాబాద్..
హైదరాబాద్ 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్ క్రీజులో ఉన్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్, అభిషేక్ ఔట్..
మూడో ఓవర్లో హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో 37 పరుగులు చేసిన తర్వాత దీపక్ చాహర్ వేసిన ఓవర్ నాలుగో బంతికి అభిషేక్ శర్మ ఔటయ్యాడు. ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 46/1.
-
ముఖేష్ కుమార్ వేసిన ఓవర్లో అభిషేక్ శర్మ 27 పరుగులు
రెండో ఓవర్ వేయడానికి వచ్చిన ముఖేష్ కుమార్ ఓవర్లో అభిషేక్ శర్మ 27 పరుగులు చేశాడు. ఈ ఓవర్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. ఈ ఓవర్ తర్వాత హైదరాబాద్ స్కోరు 35 పరుగులు.
-
రెండో ఓవర్లో ఉతికారేసి అభిషేక్..
హైదరాబాద్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నారు.
-
హైదరాబాద్ టార్గెట్ 166
చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ టార్గెట్ 166పరుగులుగా నిలిచింది.
-
18 ఓవర్లకు చెన్నై..
చెన్నై 18 ఓవర్లలో నాలుగు వికెట్లకు 152 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్ ఉన్నారు.
-
120 పరుగులు దాటిన చెన్నై స్కోర్..
చెన్నై 14 ఓవర్లలో మూడు వికెట్లకు 120 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే, రవీంద్ర జడేజా ఉన్నారు.
-
12 ఓవర్లలో చెన్నై
12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే, శివమ్ దూబే ఉన్నారు. వీరిద్దరి మధ్య యాభై భాగస్వామ్యం కొనసాగుతోంది.
-
10 ఓవర్లో 84 పరుగులు..
చెన్నై 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే, శివమ్ దూబే ఉన్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన చెన్నై
చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26(24) పరుగుల వద్ద షాబాద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై టీం 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.
-
50 పరుగులు దాటిన చెన్నై స్కోర్
7వ ఓవర్లో చెన్నై 50 పరుగుల మార్కును దాటింది. మయాంక్ మార్కండే వేసిన ఓవర్ రెండో బంతికి గైక్వాడ్ ఒక్క పరుగుతో జట్టును 50 పరుగులకు చేర్చాడు. ఈ ఓవర్ తర్వాత చెన్నై స్కోరు 54/1గా నిలిచింది.
-
చెన్నైకి తొలి షాక్ ఇచ్చిన భువీ..
నాలుగో ఓవర్ తొలి బంతికే భువనేశ్వర్ కుమార్ 25 పరుగుల స్కోరు వద్ద చెన్నైకి తొలి దెబ్బ ఇచ్చాడు. ఈ ఓవర్ తొలి బంతికే భువీ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర అద్భుతమైన షాట్ ఆడినా.. ఐడెన్ మార్క్‌రామ్ అంతకు మించిన క్యాచ్ పట్టాడు. దీంతో 12 పరుగుల వద్ద రచిన్ ఔటయ్యాడు.
-
ఇంపాక్ట్ ప్లేయర్స్:
చెన్నై సూపర్ కింగ్స్: శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరి.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి.
-
CSK Playing XI: చెన్నై సూపర్ కింగ్స్..
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
-
SRH Playing XI: సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
-
SRH vs CSK Toss Update: టాస్ గెలిచిన హైదరాబాద్..
టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
ముస్తాఫిజుర్‌కి ఆడటం కష్టమే..
ఈరోజు జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి చెందిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడడం కష్టమేనని తెలుస్తోంది. రెహమాన్ తన యూఎస్ వీసా సంబంధిత పని కోసం తన దేశానికి తిరిగి వెళ్లాడు. ప్రస్తుతం రెహమాన్ మొత్తం 7 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.
-
తలా ధోని ఎంట్రీ..
మైదానంలో అడుగుపెట్టిన ధోని టీం..
The golden hour is here! 🦁➡️🏟️#SRHvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/X9L6wXTDyU
— Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2024
-
SRH vs CSK Toss Update: మరికొద్దిసేపట్లో టాస్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో టాస్ జరగనుంది.
-
SRH vs CSK Live Score: ఉప్పల్‌లో ఇరుజట్ల రికార్డులు..
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇరు జట్ల రికార్డులు సమంగా ఉన్నాయి. SRH, CSK మధ్య ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 4 మ్యాచ్‌లు జరిగాయి. హైదరాబాద్ 2 గెలుపొందగా, చెన్నై కూడా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Atmosphere outside uppal stadium 💥#CSKvsSRH pic.twitter.com/qShrPlmbiB
— GoodMan🇮🇳 (@Dhonified_07) April 5, 2024
-
SRH vs CSK Live Score: పసుపు మయంగా ఉప్పల్..
ఉప్పల్ స్టేడియంలో మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ధోని ఫ్యాన్స్ స్టేడియానికి క్యూ కట్టారు. ఈ క్రమంలో ఉప్పల్ పరిసరాలు పసుపుమయంలా మారాయి.
Uppal Stadium Will Under THALA’S Control🥵🔥#CSKvsSRH pic.twitter.com/w0dS0iuZYp
— SURESH NTR 😎🔥 (@SureshT99999) April 5, 2024
-
SRH vs CSK Live Score IPL 2024: సిద్ధమైన ఉప్పల్..
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య IPL 2024లో భాగంగా 18వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
-
చెన్నైదే పైచేయి..
ఓవరాల్‌గా ఇరుజట్ల పోరులో చెన్నై ముందంజలో ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు హైదరాబాద్, చెన్నై మధ్య 19 మ్యాచ్‌లు జరిగాయి. హైదరాబాద్‌లో 5, చెన్నైలో 14 గెలిచాయి. అంటే హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నై 74% విజయం సాధించింది.
Published On - Apr 05,2024 5:29 PM




