IPL 2024 Sets New Record: ఈ సీజన్‌లో 17వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్ మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టోర్నీ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. టోర్నీ చరిత్రలో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 300కి పైగా సిక్సర్లు బాదడం అదే తొలిసారి. ఈ సీజన్‌కు ముందు జరిగిన 16 ఎడిషన్లలో తొలి 17 మ్యాచ్‌ల్లో కొట్టిన సిక్సర్లతో పోలిస్తే.. ఈ ఎడిషన్‌లో ఎక్కువ సిక్సర్లు నమోదయ్యాయి.