- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Suryakumar Yadav Joins Mumbai Indians Camp and may Played Delhi Capitals Match on April 7th
IPL 2024: మిస్టర్ 360 ప్లేయర్ ఆగయా.. ఇకనైనా ముంబై విజయాల బాట పట్టేనా?
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు గత నెలలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో, ముంబై ఇండియన్స్ జట్టులోని తొలి మూడు మ్యాచ్‌లకు అతను అందుబాటులో లేడు. ఇప్పుడు ఐపీఎల్ 2024లో అడుగుపెట్టిన సూర్య రేపు (ఆగస్టు 7) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నాడు.
Updated on: Apr 06, 2024 | 10:52 AM

సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ (IPL 2024) సీజన్ 17లోకి ప్రవేశించాడు. గత 2 వారాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న సూర్య ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వచ్చాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ జట్టులో కూడా చేరాడు.

శుక్రవారం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన సూర్యకుమార్ అదే రోజు ప్రాక్టీస్‌కు వెళ్లాడు. కాబట్టి, తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా ఉంటాడని చెప్పొచ్చు.

మూడు వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ రాక కొత్త బలాన్ని నింపనుంది. ఎందుకంటే, గత మూడు మ్యాచ్‌ల్లో ముంబై జట్టు మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

ప్రస్తుతం టీ20 స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ రాకతో ముంబై జట్టు బ్యాటింగ్ బలం పెరుగుతుంది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో ఇక నుంచి భీకర బ్యాటింగ్‌ను ఆశించవచ్చు.

ముంబై ఇండియన్స్ తరపున 85 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 2688 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 20 అర్ధ సెంచరీలు చేశాడు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు.

దీంతో సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ ముంబై ఇండియన్స్ జట్టు ఫలితాలపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. దీని ప్రకారం వచ్చే మ్యాచ్‌లోనైనా ముంబై ఇండియన్స్ విజయాల ఖాతా తెరుస్తుందో లేదో వేచి చూడాలి.




