AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బౌలర్ అప్పీల్ చేయలే.. కట్‌చేస్తే.. బ్యాటర్‌కు భారీ షాక్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా?

Sindh Premier League Video: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ఫీట్ కనిపించింది. ఈ లీగ్ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీని బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. అబ్దుల్ రజాక్ మెంటార్‌గా నిర్వహణలో పాల్గొంటున్నారు. అయినప్పటికీ, లీగ్‌లో ఈ స్థాయి అంపైరింగ్ కారణంగా, పాకిస్తాన్ క్రికెట్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అపకీర్తిని పొందుతోంది.

Video: బౌలర్ అప్పీల్ చేయలే.. కట్‌చేస్తే.. బ్యాటర్‌కు భారీ షాక్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా?
Sindh Premier League
Venkata Chari
|

Updated on: Jan 27, 2024 | 4:03 PM

Share

Sindh Premier League: పాకిస్థాన్‌లో ప్రతిరోజూ ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంటుంది. అది దేశం గురించి అయినా, దేశ క్రికెట్ బోర్డు గురించి అయినా. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిత్యం వార్తల్లో నిలిచే ప్రపంచంలోని ఏకైక క్రికెట్ బోర్డుగా మారింది. దీనిలో మేనేజ్‌మెంట్, సిబ్బంది ప్రతి రెండు నెలలకోసారి మారుతూ ఉంటారు. అదే సమయంలో, పాకిస్థాన్‌లో ఆడే టీ20 లీగ్‌లు కూడా చెడు పరిస్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో సింధ్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. అయితే, ఈ లీగ్‌లో జరిగిన ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు చర్చలకు దారి తీసింది.

అప్పీల్ చేయకుండానే బ్యాట్స్‌మన్ ఔట్?

సింధ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో అంపైర్ వింత ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. ఈ లీగ్ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బౌలర్ నుంచి ఒక బంతి నేరుగా బ్యాట్స్‌మెన్ ప్యాడ్‌కు తగలడం చూడొచ్చు. బంతి లెగ్‌లో పడినా ఎల్‌బీడబ్ల్యూ అవకాశం లేకపోలేదు. దీని కారణంగా ఫీల్డింగ్ వైపు అప్పీల్ చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇక్కడ అంపైర్ అందరినీ ఆశ్చర్యపరిచి వేలు పైకెత్తి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేశాడు. అంపైర్ చేసిన ఈ చర్యను బ్యాట్స్‌మెన్ కూడా నమ్మలేక ఫీల్డింగ్ టీమ్ కూడా నవ్వడం మొదలుపెట్టింది.

సింధ్ ప్రీమియర్ లీగ్ నిర్వహణలో పాకిస్థానీ క్రికెట్‌లోని చాలా మంది పెద్ద పేర్లు ఉన్నాయి. ఈ లీగ్ వైస్ చైర్మన్ జావేద్ మియాందాద్. ఈ లీగ్ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీని బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. అబ్దుల్ రజాక్ మెంటార్‌గా నిర్వహణలో పాల్గొంటున్నారు. అయినప్పటికీ, లీగ్‌లో ఈ స్థాయి అంపైరింగ్ కారణంగా, పాకిస్తాన్ క్రికెట్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అపకీర్తిని పొందుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..