IND vs NZ 3rd T20I: చివరి టీ20లో పంత్‌పై వేటు.. అరంగేంట్రం చేయనున్న టీమిండియా స్టార్ ఓపెనర్?

న్యూజిలాండ్‌తో జరగబోయే మూడో మ్యాచ్‌లో రిషబ్ పంత్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌ టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు.

IND vs NZ 3rd T20I: చివరి టీ20లో పంత్‌పై వేటు.. అరంగేంట్రం చేయనున్న టీమిండియా స్టార్ ఓపెనర్?
Ind Vs Nz Shubman Gill
Follow us

|

Updated on: Nov 21, 2022 | 4:44 PM

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా అద్భుతమైన ఫాంలో కనిపిస్తోంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్‌ రద్దవగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఓపెనింగ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి పంత్ బరిలోకి దిగాడు. కానీ, అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేక కేవలం 46.15 స్ట్రైక్ రేట్‌తో 13 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో మూడోది, చివరిదైన టీ20ఐలో పంత్ స్థానంలో మరో ప్లేయర్ బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఓపెనర్‌కు అవకాశం దక్కే ఛాన్స్..

తదుపరి మ్యాచ్‌లో రిషబ్ పంత్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ని జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ తదుపరి మ్యాచ్ ద్వారా, గిల్ అంతర్జాతీయ టీ20లో కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. గిల్ ఇప్పటి వరకు భారత్ తరపున టెస్టు క్రికెట్, వన్డే మ్యాచ్‌లు ఆడాడు. గిల్ అనేక సందర్భాల్లో భారత జట్టు కోసం ఓపెనింగ్ చేశాడు. వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా ఆడుతూ కనిపిస్తాడు.

గిల్ ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్‌లో కూడా తన సత్తా చాటేందుకు ప్రయత్నించవచ్చు. వన్డే క్రికెట్‌లో ఆడుతున్న గిల్ 12 మ్యాచ్‌ల్లో 57.90 సగటుతో 579 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు మూడు అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అదే సమయంలో IPL 2022లో, అతను 16 మ్యాచ్‌లలో 34.50 సగటుతో 132.33 స్ట్రైక్ రేట్‌తో 483 పరుగులు చేశాడు. టీ20 పరంగా చూస్తే ఈ గణాంకాలు బాగానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో గిల్ T20 అంతర్జాతీయ అరంగేట్రం సాధ్యమయ్యేలా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

పంత్ టీ20 కెరీర్ అంతగా బాగోలేదు..

టెస్ట్ క్రికెట్‌లో అద్భుతంగా కనిపించిన రిషబ్ పంత్ ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్‌లో అంతగా ఆకట్టుకోలేదు. పంత్ తన చివరి నాలుగు టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌ల్లో 42 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఆఫ్రికాపై 27, జింబాబ్వేపై 3, ఇంగ్లండ్‌పై 6, న్యూజిలాండ్‌పై 6 ఉన్నాయి. పంత్ ఇప్పటివరకు మొత్తం 65 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 22.69 సగటు, 125.77 స్ట్రైక్ రేట్‌తో 976 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..