ఇంకా కోలుకుని శ్రేయాస్ అయ్యర్.. దక్షిణాఫ్రికాతో వన్డేలకు అనుమానమే..!
నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ పాల్గొనడంపై ఇంకా సందేహాలు ఉన్నాయి. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత, భారత్ రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నంలో మూడు వన్డేలు ఆడనుంది. ఇటీవలే ఆస్ట్రేలియా నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన అయ్యర్ తనకు తగిలిన గాయం నుండి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది.

భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. అయ్యర్ పరిస్థితి మొదట అనుకున్న దానికంటే చాలా తీవ్రంగా ఉంది. ఈ సంఘటన తర్వాత ఒక సమయంలో, అతని ఆక్సిజన్ లెవల్స్ 50 కి పడిపోయింది. “అతను దాదాపు 10 నిమిషాలు సరిగ్గా నిలబడలేకపోయాడు. అతని చుట్టూ పూర్తిగా బ్లాక్‌అవుట్ ఏర్పడింది. అతను సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది” అని భారత బోర్డుకు ఒకరు తెలిపారు.
నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ పాల్గొనడంపై ఇంకా సందేహాలు ఉన్నాయి. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత, భారత్ రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నంలో మూడు వన్డేలు ఆడనుంది. ఇటీవలే ఆస్ట్రేలియా నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన అయ్యర్ తనకు తగిలిన గాయం నుండి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ఫిట్‌గా ఉండటానికి మరింత సమయం అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.
అయ్యర్ ఆరోగ్య స్థితి గురించి సెలక్షన్ కమిటీకి సమాచారం అందింది. వైద్య నివేదికల ప్రకారం అతను ఫిట్‌గా ఉండటానికి దాదాపు ఒక నెల కన్నా ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు. “అతను పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి ఎక్కువ సమయం పడుతుంది. అతని గాయం తర్వాత బోర్డు, సెలక్షన్ కమిటీ తొందరపడటంలేదు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో అతను ఆడటం సందేహమే” అని భారత బోర్డులోని ఒక వర్గాలు ధృవీకరించాయి. అతను సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు.
గత వారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన 3వ వన్డే సందర్భంగా గాయపడిన అయ్యర్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అలెక్స్ కారీని అవుట్ చేయడానికి డైవింగ్ క్యాచ్ తీసుకుంటూ అయ్యర్ నేలపై పడి గాయపడ్డాడు. పొత్తికడుపులో ప్లీహానికి గాయం కావడంతో అంతర్గత రక్తస్రావంతో ఆయనను సిడ్నీ ఆసుపత్రిలో చేర్చారు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి గత వారం డిశ్చార్జ్ చేశారు.
వీడియో చూడండి..
Shreyas SUPERMAN Iyer! 💪
Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy
— Star Sports (@StarSportsIndia) October 25, 2025
అయ్యర్ ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి వైద్య సంరక్షణలో ఉన్నాడు. పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ పొందడానికి అతనికి ఒక నెల కంటే ఎక్కువ సమయం పడుతుందని అంచనా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




