AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs PBKS : షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు.. వైరల్ అవుతున్న వీడియో

KKR vs PBKS : ఐపీఎల్ 2026లో కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రద్దు తర్వాత శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. కేకేఆర్‌ను ఆమె దారుణంగా ట్రోల్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

KKR vs PBKS : షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు.. వైరల్ అవుతున్న వీడియో
Shresta Iyer Mocks Kkr
Rakesh
|

Updated on: Apr 07, 2026 | 7:45 AM

Share

KKR vs PBKS : ఐపీఎల్ 2026లో వరుణుడి ఎంట్రీతో ఈక్వేషన్స్ ఆసక్తికరంగా మారిపోయాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన కేకేఆర్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లు తలో పాయింట్‌ను పంచుకున్నాయి. అయితే, ఈ పాయింట్ల పంపిణీ కంటే కూడా సోషల్ మీడియాలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. షారుఖ్ ఖాన్ జట్టును టార్గెట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చిత్రమేమిటంటే.. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో వరుసగా రెండో ఏడాది కూడా కేకేఆర్, పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. గతేడాది ఏప్రిల్ 26న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 201 పరుగులు చేయగా, కేకేఆర్ ఛేదన మొదలుపెట్టిన కొద్దిసేపటికే వాన పడి ఆట ఆగిపోయింది. ఈసారి (ఐపీఎల్ 2026) మాత్రం కనీసం మొదటి ఇన్నింగ్స్ కూడా పూర్తి కాకముందే మ్యాచ్ రద్దయింది. దీంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కేకేఆర్ ఎట్టకేలకు ఒక పాయింట్ సాధించి తన ఖాతాను తెరిచింది.

మ్యాచ్ రద్దు తర్వాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన సోదరుడు కెప్టెన్సీ వహిస్తున్న జట్టు నంబర్ 1 స్థానంలో ఉండటం, అదే సమయంలో కేకేఆర్ పాయింట్ల కోసం కష్టపడుతుండటంతో ఆమె వ్యంగ్యంగా స్పందించింది. షారుఖ్ ఖాన్ టీమ్ కేకేఆర్‌ను ఎగతాళి చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. “పంజాబీలకు గుండె చాలా పెద్దది.. అందుకే ఈ ఒక్క పాయింట్‌ను కేకేఆర్‌కు దానమిస్తున్నాం తీసుకోండి” అని ఆమె అనడం ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌లో చర్చనీయాంశమైంది.

ప్రస్తుత ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికను గమనిస్తే.. పంజాబ్ కింగ్స్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 5 పాయింట్లతో గర్వంగా అగ్రస్థానంలో నిలిచింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రేయస్ సేన ఈ సీజన్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. 3 మ్యాచ్‌లు ఆడినా కేవలం ఈ వర్షం పుణ్యమా అని వచ్చిన ఒక పాయింట్‌తో 8వ స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ ఫ్యాన్స్ శ్రేష్ఠ అయ్యర్ పోస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పంజాబ్ అభిమానులు మాత్రం ఆమె సెటైర్లను ఎంజాయ్ చేస్తున్నారు.

మైదానంలో ఆట రద్దయినా, సోషల్ మీడియాలో మాత్రం కేకేఆర్, పంజాబ్ ఫ్యాన్స్ మధ్య యుద్ధం నడుస్తోంది. శ్రేష్ఠ అయ్యర్ గతంలో కూడా తన అన్నయ్య కోసం ఇలాంటి పోస్టులు చేసి వార్తల్లో నిలిచింది. ఒక పక్క కెప్టెన్ గా శ్రేయస్ తన జట్టును నంబర్ 1 పొజిషన్ కి తీసుకెళ్లడం చూసి గర్వపడుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే కేకేఆర్ లాంటి పెద్ద టీమ్ ను ఇలా పబ్లిక్ గా ట్రోల్ చేయడం పట్ల కొంతమంది క్రికెట్ నిపుణులు మాత్రం పెదవి విరుస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి