Gunde Ninda Gudi Gantalu:బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో బాలు పాసవుతాడా? మీనాకు ఒక్క రోజు అత్త ప్రేమ
Gunde Ninda Gudi Gantalu: పెళ్లి ఇంట్లో ఎవరూ గమనించని సమయంలో దొంగ జంట పెళ్లికూతురి గదిలోని నగలు, చీరలతో బ్యాగ్ నింపుకుని పరారయ్యేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు సుందరి గది తలుపు లాక్ కావడంతో మాణిక్యం లోపలే చిక్కుకుపోతాడు. దొంగ పద్మ చేతిలో ఉన్న పేపర్ కట్టర్‌పై మీనాకు అనుమానం రావడంతో ఆమె సుందరి గదిని తనిఖీ చేయడానికి వెళుతుంది. అయితే అప్పటికే దొంగలు నగల బ్యాగ్‌తో ఆటో ఎక్కి వెళ్లిపోతారు. చివరికి బాలు, మీనా ఆ నగలను కాపాడగలరా? ఉత్కంఠభరితమైన పరిణామాలు ఆగస్టు 4 ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Gunde Ninda Gudi Gantalu Aug 4 Episode: నగలు కొట్టేద్దామని ప్రభావతి వెనకాలే తిరుగుతుంటారు దొంగ జంట. ఈ రోజు సాయంత్రం ఎపిసోడ్‌లో అనుకున్నంత పని చేస్తారు. పెళ్లి మండపంలో బాలు మందు కొడుతున్నాడనీ ప్రభావతికి తెలుస్తుంది. బాలు అలాంటోడు కాదు.. తీసుకొచ్చి మీ ముందు నిలబెడతా ప్రూవ్ చేస్తా అత్తయ్యా అంటుంది మీనా. రోహిణిని కలిసి నిజం చెప్పేద్దామని అనుకున్న విద్య మురళీకి యాక్సిడెంట్ అయిందని కాల్‌రావడంతో పరిగెడుతుంది.
ఇద్దరు కుర్రాళ్లు వంటింటి కెళతారు. మాణిక్యంని ఆవకాయ అడుగుతారు. పెగ్ వేయడానికేనా ఇక్కడ కాదు బయటికి వెళ్లి తాగండి అంటాడు మాణిక్యం. ఆవకాయ పచ్చడి, బాటిల్‌తో మెట్లు దిగుతున్న ఇద్దర్ని చూస్తుంది మీనా. బాలు వీళ్లతో కలిసి తాగుతున్నాడా అని వాళ్లని వెంబడిస్తుంది.
పెళ్లికి గిఫ్ట్ ఇవ్వాలి.. చదివింపుల టైమ్‌లో ఎంతో కొంత మనం కూడా చదివించాలి కదా.. మనోజ్‌తో అంటుంది రోహిణి. మేకప్‌లో డిస్కౌంట్ ఇచ్చావు కదా ..మళ్లీ వేరే గిఫ్ట్ ఇవ్వాలా..? వంద సరిపోతుందా.. పోనీ రెండొందలు.. అంటాడు మనోజ్.. మీ కక్కుర్తి తగలెయ్య ..ఏం వద్దులే అని రోహిణి విసుక్కుంటుంది. నాలుగు.. ఐదొందలు అంటూ బేరానికి దిగుతాడు మనోజ్.
తాగుతోంది నేను కాదు వేరే ఇద్దరు కుర్రాళ్లు కావాలంటే వాళ్లు కార్ పార్కింగ్‌లో ఉన్నారు చూపిస్తాను పదండి అని మీనా, రవిని తీసుకెళతాడు బాలు. మాణిక్యం అదే సమయంలో పార్కింగ్‌లో వంట సామాను బాక్సుల్ని దించుతుంటాడు. మీనా, బాలు మాణిక్యానికి ఎక్కడ ఎదురుపడతారా అని ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూసేలా ఉంటుందా సీన్.
పెళ్లికి వచ్చిన ఆడవారిని కామాక్షి పనిగట్టుకునీ మరీ వెళ్లి పలకరిస్తుంటుంది. అబ్బా మీ నగలు మెరిసిపోతున్నాయండీ అని వారంటే ఇవన్నీ నావే .. చీటీలు వేసి కొన్నాను .. అంటుంది. కామాక్షి నోరు నొక్కి ఎలాగైనా నగలు కొట్టేద్దామని దొంగ జంట ఆమె వెంటే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఛీ.. ఛీ ఎప్పుడూ జనం మధ్యే తిరుగుతోంది ..నగలు కొట్టేయడం ఎలా అంటుంది పద్మ. బాధపడకే.. పెళ్లి కూతురి గదిలో బోలెడు నగలున్నాయి.. సమయం చూసి కొట్టేద్దాం అంటాడు పురుషోత్తం. వంట మాస్టారుకి ఒంట్లో బాగోలేదని .. పెళ్లికొడుకు మేనమామ వంటలు చేస్తున్నాడు.. సుందరి అత్తారింట్లో అంతా ఇంత కలుపుగోలుగా ఉంటారా .. అబ్బో సుందరి అత్తగారి తరపు వాళ్లు చాలా మంచి వాళ్లే సుమా ..అంటుంది ప్రభావతి.
పెళ్లి మండపం బయట ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళతాడు బాలు. సార్ .. సార్ .. మీ దగ్గర బ్రీత్ అనలైజర్ ఉందా .. ప్లీజ్ సర్ నాకు హెల్ప్ చేయండి.. నేను తాగకపోయినా తాగావని అంటున్నారు.. ఇది నా జీవితం సర్.. నా సంసారం సర్. అంటాడు. ఈ సమస్య నాకే అనుకున్నాను.. ఈ నింద నేను మాత్రమే పడుతున్నా అనుకున్నాను. లోకమంతా ఇంతేనని ఇప్పుడే తెలుసుకున్నాను అంటాడు పోలీస్. మా ఆవిడ దగ్గరికొచ్చి నాతో ఊదించాలి సర్ అంటాడు బాలు. అగ్ని పరీక్ష లాగా ..ఆల్కహాల్ నిండు పరీక్ష చేయించుకుని .. నా సంసారాన్ని నిలబెట్టుకోవాలి అంటాడు. వాహనాలు డ్రైవ్ చేసే వారికే టెస్ట్.. నడిచొచ్చే వాళ్లకి కూడా టెస్ట్ చేస్తే నన్ను పిచ్చోడిలా చూస్తారు అంటాడు పోలీసు. సాటి మగాడిలా నీ సమస్యని అర్థం చేసుకున్నా అంటాడు.
నేను తాగుతున్నాననీ ఎందుకు అమ్మకి చాడీలు చెప్పావు.. తాగడం నువ్వు చూసావా అని బాలు మనోజ్‌తో అంటాడు. మనోజ్ కళ్లజోడు లాక్కుంటాడు. కళ్లజోడు ఇచ్చేయమంటుంది రోహిణి. అయినా మన లెవలేంటి మనోజ్.. డ్రైవర్లతోనూ పూలమ్ముకునే వాళ్లతోనూ మాటలు పడుతూనే ఉంటావా .. రోహిణి మనోజ్‌తో అంటుంది. సరే నేను డ్రైవర్‌నే.. నువ్వు పార్లర్‌కి వెళ్లి నీ మొగుడికి ఎన్ని లక్షలు తెచ్చిచ్చావు? బాలు అంటాడు. నీ పార్లర్ కూడా అత్తయ్య పెట్టించిందే కదా .. మా డబ్బులతో మీ ఆయనకి బిజినెస్ పెట్టించి.. నువ్వు లెవెల్ గురించి మాట్లాడుతున్నావా.. రోహిణితో మీనా అంటుంది.
ముహూర్తానికి వేళ అవుతుంది. . పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటాడు పురోహితుడు. నువ్వుండు కామాక్షి..అమ్మా మీనా ..నీ చేయి చాలా మంచిది.. నువ్వే వెళ్లి పెళ్లికుమార్తెను తీసుకురా.. వెళ్లమ్మా..అని ప్రభావతి మీనాతో అంటుంది. మీ కుటుంబంలో అన్యోన్యత చూస్తుంటే ముచ్చటేస్తుంది అని ముంబై ముకేష్ అంటాడు. పెళ్లికూతుర్ని తీసుకురావడానికి వెళుతున్నావా.. మీనాతో బాలు అంటాడు. ముంబై ముకేష్ ఉన్నాడు కాబట్టి నన్ను తీసుకురమ్మని పంపించారు.. నిజానికి నేను ఎలాంటి అత్త రావాలని కోరుకున్నానో .. ఈ ఒక్క రోజులో అలాంటి అత్తను చూపించారు.. ఆవిడ ఎందుకు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారో నాకర్థమైంది..అదే నిజమైతే ఎంత బావుంటుందో .. అంటుంది మీనా. ఏమో ఎవరు చెప్పొచ్చారు.. ఏదైనా అద్భుతం జరిగి నచ్చే కోడలు నచ్చకుండా పోవచ్చు.. నచ్చని కోడలు నచ్చనూ వచ్చు అంటాడు బాలు.
ఇప్పుడు పెళ్లికూతుర్ని మండపానికి తీసుకెళతారు.. ఎవ్వరూ ఉండరు.. తాళి కట్టేదాకా అటు వైపు ఎవ్వరూ రారు.. గదిలో ఉన్న నగలు డబ్బు ఏముంటే అవి తీసుకొచ్చేసేయ్ అని పురుషోత్తం పద్మతో అంటాడు. మురళీకి యాక్సిడెంట్ అయిందని విద్యకి కాల్ వస్తుంది. విద్య పరిగెత్తుకుంటూ రావడం మురళీ చాటుగా చూస్తాడు.. బాలూ అన్నా.. నువ్విచ్చిన ఐడియా గ్రేట్.. విద్యకి నేనెంటే ఎంతో ప్రేమ.. ఇంతకంటె పెద్ద ప్రూఫ్ ఏముంటుంది అని మురళి అంటాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు.. ఒప్పుకో అంటాడు మురళీ. ప్రేమ అంటే ఎమోషన్స్‌తో ఆడుకోవడం కాదు.. ఏద అయిపోయిందని ఎంత కంగారుపడ్డానో తెలుసా? మురళీని చెంప దెబ్బ కొడుతుంది విద్య. అంత గట్టిగా కొట్టిందేంట్రా.. నీ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది కదరా.. మురళీ ఫోన్ నుంచి కాల్ చేసిన అక్కడే ఉన్న మురళీ కజిన్ అంటుంది. ఇప్పుడు మండపానికి వెళ్లడానికి చాలా టైమ్ పడుతుంది.. ఇప్పుడే ఫోన్ కూడా స్విచాఫ్ అవ్వాలా .. రోహిణీ .. ఇంక నిన్ను ఆ దేవుడే కాపాడాలి .. అంటుంది విద్య.
దొంగ జంట పెళ్లికూతురి గదిలో ఎవరూ లేకపోవడం చూసి అందినకాడికి నగలు చీరలు ఎత్తుకెళతారు. సుందరి గదిని చూసి డోర్ పెట్టబోతూ డోర్ లాక్ అయి మాణి్క్యం లోపలే ఉండిపోతాడు.. మేనల్లుడి పెళ్లికి అక్షింతలు వేద్దామని అనుకుంటాడు. కానీ బయటకు రాలేక లోపలే ఉండపోతాు. దొంగ పద్మ చేతిలో పేపర్ కట్టర్ చూసి అది ఎందుకు అంటుంది మీనా. పూలు కత్తిరించడానికి అంటుంది. ఆమె మీద అనుమానంతో సుందరి గది చెక్ చేయడానికి మీనా వెళుతుంది. అప్పటికే ఆటో మాట్లాడుకుని నగల బ్యాగ్‌తో ఆటో ఎక్కేస్తారు దొంగ జంట. ఆటో బయలుదేరుతుంది.. నగల బ్యాగ్‌ను బాలు, మీనా సురక్షితం చేస్తారా? ఏమవుతుందో ఆగస్ట్ 4 రోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో చూసేయండి.