AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన.. టీచర్‌పై 30 కత్తిపోట్లు.. వీడియోలో షాకింగ్ సీన్!

హర్యానాలో ఉపాధ్యాయురాలిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఫరీదాబాద్‌‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న 29 ఏళ్ల సంధ్య అనే టీచర్‌పై 21 ఏళ్ల యువకుడు అమిత్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

స్కూల్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన.. టీచర్‌పై 30 కత్తిపోట్లు.. వీడియోలో షాకింగ్ సీన్!
School Teacher Murder
Balaraju Goud
|

Updated on: Aug 04, 2026 | 1:20 PM

Share

హర్యానాలో ఉపాధ్యాయురాలిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఫరీదాబాద్‌‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న 29 ఏళ్ల సంధ్య అనే టీచర్‌పై 21 ఏళ్ల యువకుడు అమిత్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో, గతంలో నమోదైన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై పగతోనే ఈ దాడి చేసినట్లు అతడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం, సోమవారం ఉదయం సుమారు 9.30 గంటలకు సంధ్య విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు చేరుకుంది. కొద్దిసేపటి తర్వాత ముఖానికి తెల్లటి స్కార్ఫ్ కట్టుకున్న అమిత్ పాఠశాల గేటు వద్దకు వచ్చి ఆమెను కలవాలని కోరాడు. పాఠశాల సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంధ్య ప్రధాన ద్వారం వద్దకు రాగానే, అతడు ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. మెడ, ఛాతీ, ముఖం, పొట్ట భాగాలపై వరుసగా కత్తిపోట్లు పొడిచాడు. తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించినా దాడి కొనసాగించాడని, ఆమె నేలపై పడిపోయిన తర్వాత కూడా కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు.

దాడిని అడ్డుకునేందుకు పాఠశాల నిర్వాహకుడు తేజ్‌పాల్ ప్రయత్నించగా, నిందితుడు కత్తితో బెదిరించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం అమిత్ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న సంధ్యను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ఘటన మొత్తం పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే అందులోని దృశ్యాలు అత్యంత భయానకంగా ఉండటంతో పోలీసులు వాటిని దర్యాప్తు కోసం స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నప్పటికీ, బాధితురాలి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని షేర్ చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, అమిత్‌కు సంధ్యతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆమె అంగీకారం లేకుండానే పదేపదే వెంటపడటం, మాట్లాడేందుకు ప్రయత్నించడం వల్ల సంధ్య ఇటీవల అతడిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. అప్పట్లో క్షమాపణ చెప్పిన అమిత్, అదే విషయంపై పగ పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సెక్టార్-58 పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సీసీ కెమెరా దృశ్యాలను ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us