AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: లీగ్ దశలోనే భారత జట్టు ఇంటికి.. ఆ బలహీన జట్టే ఫైనల్ చేరేది: పాక్ మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్

Champions Trophy: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారీ అంచనా వేశాడు. ఏ జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయో అక్తర్ చెప్పుకొచ్చాడు. అలాగే, భారత జట్టు ఓడిపోతుందంటూ షాకిచ్చాడు. అసలు షోయబ్ ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Champions Trophy: లీగ్ దశలోనే భారత జట్టు ఇంటికి.. ఆ బలహీన జట్టే ఫైనల్ చేరేది: పాక్ మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్
Champions Trophy India
Venkata Chari
|

Updated on: Feb 08, 2025 | 2:32 PM

Share

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ మరి కొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో, క్రికెట్ దిగ్గజాలు కూడా ఈ టోర్నమెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరగబోతోంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఫైనల్ చేరే జట్లపై నిరంతరం అంచనాలు వేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చి సంచలనం సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంటుందని షాకిచ్చాడు. అలాగే, టీం ఇండియా ఓటమితో లీగ్ దశ నుంచే ఇంటి బాట పడుతుందంటూ జోస్యం చెప్పాడు.

సెమీఫైనల్‌కు ఆఫ్ఘనిస్తాన్..

షోయబ్ అక్తర్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టును ప్రశంసించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ కాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌ను సెమీ-ఫైనల్లో చూడాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించడం చూడాలని కూడా అక్తర్ కోరుకుంటున్నానంటూ తెలిపారు.

అఫ్గానిస్తాన్ బలహీనమైన జట్లలో ఒకటిగా పరిగణిస్తుంటారు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా, ఆఫ్ఘనిస్తాన్ దిగ్గజ జట్లకు షాక్‌లపై షాక్‌లు ఇస్తూ తమ సత్తా చాటుకుంటుంది. 2023 వన్డే ప్రపంచ కప్‌లో, ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏ జట్టు కూడా అఫ్గానిస్తాన్‌ను తేలికగా తీసుకోదు. 2023 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాను ఓడించడానికి ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా దగ్గరగా ఉంది. మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. కానీ, గ్లెన్ మాక్స్‌వెల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ వారి నుంచి విజయాన్ని లాక్కుంది.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ భారత్‌ను ఓడిస్తుందంటూ అక్తర్ జోస్యం..

ఇది కాకుండా, ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు భారతదేశాన్ని ఓడిస్తుందని అక్తర్ పేర్కొన్నాడు. ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య బిగ్ మ్యాచ్ జరగనుంది. కానీ, షోయబ్ అక్తర్ టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంటుందని నమ్ముతున్నానంట చెప్పుకొచ్చాడు. షోయబ్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ తలపడటం చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు.

పాకిస్తాన్‌తో పాటు ఏయే జట్లతో భారత్ తలపడుతుందంటే..

ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో తలపడే ముందు, టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మార్చి 2న, భారత జట్టు తన చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..