AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ పాకిస్థాన్ లో సెంచరీ చేస్తే అదో రికార్డ్: షోయబ్ అక్తర్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో నిర్వహించాలనే కొనసాగుతోంది. టీమిండియా పాకిస్థాన్ లో ఆడేందుకు నిరాకరించడంతో ఈ వివాదం ముదిరింది. అయితే టీమిండియా పాకిస్థాన్ లో పర్యటించాలని షోయబ్ అక్తర్, పాకిస్థాన్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడం చారిత్రక ఘట్టమవుతుందని పేర్కొన్నారు. టీమిండియా లేకుండా ఈ టోర్నీ నిర్వహిస్తే, క్రికెట్ ప్రపంచం, ఆతిథ్య దేశానికి భారీ నష్టాలు ఉండే అవకాశముందని అక్తర్ హెచ్చరించారు.

కోహ్లీ పాకిస్థాన్ లో సెంచరీ చేస్తే అదో రికార్డ్: షోయబ్ అక్తర్
Virak Kohli Akthar
Narsimha
|

Updated on: Nov 20, 2024 | 12:40 PM

Share

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. పాకిస్తాన్‌లో నిర్వహించాలనే అంశం చుట్టూ వివాదాలు పెరుగుతున్నాయి. భారత క్రికెట్ జట్టు ఆ దేశంలో ఆడటానికి నిరాకరించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. బిసిసిఐ ఈ విషయాన్ని ఐసిసికి అధికారికంగా తెలియజేసింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) కఠినమైన వైఖరి తీసుకుంది. హైబ్రిడ్ మోడల్‌ను పిసిబి అంగీకరించకుండా, రెండు బోర్డులు తమ నిర్ణయాలపై మొండిగా నిలిచాయి.

టీమిండియా పాకిస్థాన్ వెళ్లి ఆడటానికి సంసిద్దంగా లేకపోవడంతో ఆ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫికే ఎఫెక్ట్ పడెలా ఉంది. ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ రావల్పిండి షోయబ్ అక్తర్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమస్యల పరిష్కారం కోసం అందరు ప్రయత్నించాలని అన్నాడు. ఐసిసికి 95-96 శాతం స్పాన్సర్‌షిప్ ఇండియా నుంచే వస్తుందని మాకు తెలుసు. ఇది ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. ఒక వేళ టీమిండియా పాకిస్థాన్ లో పర్యటిస్తే విరాట్ కోహ్లీ మొదటిసారి పాకిస్తాన్‌లో ఆడబోతున్నాడు. పాకిస్తాన్‌లో విరాట్ సెంచరీ సాధిస్తే, అది చారిత్రక ఘట్టమవుతుంది” అని అక్తర్ అన్నారు.

అయితే, పిసిబి-ఐసిసి భారతదేశం లేకుండా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తే 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 844 కోట్లు) నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. “భారతదేశం లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే, ఆతిథ్య దేశం స్పాన్సర్‌షిప్ నష్టపోవడమే కాదు, ప్రపంచ క్రికెట్‌ సైతం భారీగా నష్టపోయే ప్రమాదముంది. ఇండియా పాకిస్తాన్‌లో ఆడటం క్రికెట్ అభివృద్ధికి అవసరం” అని అక్తర్ అభిప్రాయపడ్డారు.

దీనికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతుండగా, ఐసిసి ఈ వారం చివరికి షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ వివాదం ప్రపంచ క్రికెట్‌లో కొత్త మలుపులు తీసుకురానుంది.