Shikhar Dhawan IPL 2022 Auction: పంజాబ్ సొంతమైన శిఖర్ ధావన్.. ఎంతకు దక్కించుకుందంటే?
ప్రస్తుత సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ రూ. 8.25 కోట్లకు బిడ్ చేసి శిఖర్‌ను గెలుచుకుంది. శిఖర్ కోసం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది.
Shikhar Dhawan Auction Price: గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో ధావన్ వేలంలో అందుబాటులో ఉన్నాడు. గతేడాది ధావన్‌కు ఢిల్లీ రూ. 5.2 కోట్లు చెల్లించింది. 2014లో జరిగిన IPL వేలంలో ధావన్ అత్యధిక వేతనాన్ని రూ. 12.5 కోట్లకు SRH కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ రూ. 8.25 కోట్లకు బిడ్ చేసి శిఖర్‌ను గెలుచుకుంది. శిఖర్ కోసం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది.
నాలుగేళ్ల తర్వాత సరికొత్తగా.. రెండు కొత్త జట్లతో ముస్తాబైన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో (IPL 2022 Auction) 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో 370 మంది భారతీయులు కాగా, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. భారత్ తర్వాత అత్యధికంగా 47 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా నుంచి వేలంలో నిలిచారు. ఇక 590 మంది ఆటగాళ్లలో 228 మంది ఆటగాళ్లు ఇంతకు ముందు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. అదే సమయంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా అరంగేట్రం చేయని ఆటగాళ్లు 335 మంది ఈ వేలంలో ఉన్నారు. తొలి రోజు 161 మంది క్రికెటర్లు అందుబాటులో ఉంటారు.