IND vs SA: వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ చేసిన శార్దూల్.. ఆ ఘనత సాధించిన నాల్గో ఆటగాడిగా రికార్డు

టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 296 పరుగులకు ఆలౌటైంది.

IND vs SA: వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ చేసిన శార్దూల్.. ఆ ఘనత సాధించిన నాల్గో ఆటగాడిగా రికార్డు
Shardul
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 20, 2022 | 10:39 AM

టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 296 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమ్ ఇండియా 265 పరుగులకే ఆలౌటైంది. భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించగా, 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ ఠాకూర్ కూడా తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. శార్దూల్ ఠాకూర్ 43 బంతుల్లో 50 పరుగులు చేసి వన్డేల్లో మొదటి అర్ధ సెంచరీ చేశాడు.

శార్దూల్ ఠాకూర్ టెస్ట్ కెరీర్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాపై హాఫ్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాలోని గబ్బా మైదానంలో శార్దూల్ తన తొలి టెస్టు హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. శార్దూల్ ఓవల్‌లో వరుసగా 2 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు అతను దక్షిణాఫ్రికాలో కూడా వన్డే అర్ధ సెంచరీ సాధించాడు.

SENA దేశాలలో ODI-టెస్ట్ ఫార్మాట్‌లో హాఫ్ సెంచరీ సాధించిన భారతదేశం నుండి నాల్గో లోయర్ ఆర్డర్ ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. అతని కంటే ముందు కపిల్ దేవ్, అజిత్ అగార్కర్, రవీంద్ర జడేజా ఈ ఘనత సాధించారు. బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్న శార్దూల్‌.. బంతితో మాత్రం రాణించలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో శార్దూల్ 10 ఓవర్లలో 72 పరుగులిచ్చాడు. 3 నో బాల్స్ కూడా వేశాడు.

Read Also..  IND vs SA: పిచ్ బ్యాటింగ్​కు అనుకూలంగానే ఉంది.. మిడిలార్డర్ విఫలమైంది..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!