AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: పిచ్ బ్యాటింగ్​కు అనుకూలంగానే ఉంది.. మిడిలార్డర్ విఫలమైంది..

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఇప్పుడు వన్డే సిరీస్​ను ఓటమితో మొదలు పెట్టింది. బుధవారం ప్రోటీస్​తో జరిగిన మ్యాచ్​లో ఇడియా ఓడిపోయింది.

IND vs SA: పిచ్ బ్యాటింగ్​కు అనుకూలంగానే ఉంది.. మిడిలార్డర్ విఫలమైంది..
India Vs South Africa, 1st Odi Kl Rahul
Srinivas Chekkilla
|

Updated on: Jan 20, 2022 | 9:48 AM

Share

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఇప్పుడు వన్డే సిరీస్​ను ఓటమితో మొదలు పెట్టింది. బుధవారం ప్రోటీస్​తో జరిగిన మ్యాచ్​లో ఇడియా ఓడిపోయింది. శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ , భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారత్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత జట్టు 8 వికెట్లకు 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఓటమిపై కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. జట్టు మిడిల్ ఆర్డర్‌పై సరిగా రాణించలేదని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని చెప్పాడు. “ఇందులో మంచి ఆరంభాన్ని పొందాం. కానీ మేము మిడిల్ ఓవర్‌లో వికెట్లు కోల్పోతూనే ఉన్నాము, దాని కారణంగా మ్యాచ్ మా చేతుల్లో నుండి జారిపోయింది. మిడిల్ ఓవర్‌లో వికెట్లు కోల్పోకుండా చూడాలి. అప్పుడే ముందు జట్టును ఆపగలం”’ అని రాహుల్ అన్నాడు.

పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది

తొలి వన్డే వికెట్‌పై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను 20 ఓవర్లకు మించి బ్యాటింగ్ చేయలేదు. కానీ ఇంత మార్పు వచ్చిందని నేను అనుకోను. నేను ధావన్, విరాట్‌లతో వికెట్ గురించి మాట్లాడినప్పుడు, వారు బాగుందని చెప్పారు. పిచ్‌పై కొంత సమయం గడిపిన తర్వాత బ్యాటింగ్ సులువుగా మారుతుందని చెప్పారు.’ అని చెప్పాడు. దక్షిణాఫ్రికా బాగా బ్యాటింగ్ చేసినప్పుడు తమ బౌలర్లపై నిరంతరం ఒత్తిడి పెరిగిందన్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్ తీయడంలో విఫలమయ్యామని రాహుల్ వివరించాడు.

భారత జట్టు దృష్టి కూడా 2023 ప్రపంచకప్‌పైనే ఉందని కేఎల్ రాహుల్ చెప్పాడు. దానిని దృష్టిలో ఉంచుకుని, మేము మైదానంలో అత్యుత్తమ XIని ఫీల్డింగ్ చేయడంపై దృష్టి పెడుతున్నామన్నాడు. తప్పులు చేస్తాం కానీ వాటి నుంచి కూడా నేర్చుకుంటామి చెప్పాడు.

Read Also.. Big Bash League: 4 బంతుల్లో 4 వికెట్లు .. గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఆసీస్ స్పిన్నర్ ..