AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Bash League: 4 బంతుల్లో 4 వికెట్లు .. గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఆసీస్ స్పిన్నర్ ..

టీ- 20 లంటే బ్యాటర్లదే హవా అనుకుంటారు చాలామంది. అందుకే తగ్గట్లే ఈ పొట్టి క్రికెట్ లో బ్యాటింగ్ పరంగా ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి.  అయితే కచ్చితత్వంతో బంతులు వేస్తే  బౌలర్లు కూడా

Big Bash League: 4 బంతుల్లో 4 వికెట్లు .. గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన  ఆసీస్ స్పిన్నర్ ..
Basha Shek
| Edited By: |

Updated on: Jan 20, 2022 | 7:01 AM

Share

టీ- 20 లంటే బ్యాటర్లదే హవా అనుకుంటారు చాలామంది. అందుకే తగ్గట్లే ఈ పొట్టి క్రికెట్ లో బ్యాటింగ్ పరంగా ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి.  అయితే కచ్చితత్వంతో బంతులు వేస్తే  బౌలర్లు కూడా  టీ- 20లో సత్తాచాటవచ్చని ఆస్ట్రేలియా స్పిన్నర్ క్యామెరూన్ బాయ్స్ మరోసారి నిరూపించాడు.  ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో మెల్ బోర్న్ రెనిగెడ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ ఆటగాడు బుధవారం అరుదైన ఫీట్ అందుకున్నాడు. సిడ్నీతో జరిగిన మ్యాచ్ లో వరుసగా  4 బంతుల్లో  4 వికెట్లు పడగొట్టి డబుల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. క్రికెట్ లో వరుసగా  మూడు బంతుల్లో మూడు  వికెట్లు తీస్తే హ్యాట్రిక్ అని, అదేవిధంగా వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు నేల కూల్చితే డబుల్ హ్యాట్రిక్ గా పరిగణిస్తారు. అలా క్యామెరూన్ బాయ్స్ తాజా మ్యాచ్ లో డబుల్ హ్యాట్రిక్ తో సహా మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు.

కాగా గతేడాది యూఏఈలో జరిగిన టీ- 20 ప్రపంచకప్ లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంపర్ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుమందు శ్రీలంక స్పీడ్ స్టర్ లసిత్ మలింగ కూడా డబుల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. తాజాగా క్యామెరూన్ బాయ్స్ కూడా ఈ ఫీట్ ను అందుకున్నాడు. తద్వారా టీ -20 క్రికెట్ లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ గా రికార్డుల కెక్కాడు. అతను వరుస బంతుల్లో అలెక్స్ హేల్స్, జేసన్ సంఘా, అలెక్స్ రాస్,  డేనియల్ సామ్స్ ను ఔట్ చేశాడు. అయితే క్యామెరూన్ మొత్తం 5 వికెట్లు పడగొట్టినా సిడ్నీ జట్టు చేతిలో మెల్ బోర్న్ రెనిగెడ్స్ కు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది.  లక్ష్య ఛేదనలో  మెల్ బోర్న్ రెనిగెడ్స్ 169 పరుగులకే మాత్రమే పరిమితమైంది. దీంతో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది.

Also Read: Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..

IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ల్లో టాప్-10 బౌలర్లు వీరే..!

Bedroom Vastu Tips: ఈ వాస్తు దోషాలు మీకు నిద్ర లేకుండా చేస్తాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?
తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?
టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?
బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్
భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..
JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..
ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే
ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే