Sanju Samson : సంజు శాంసన్ ఐపీఎల్ 11 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ నుంచి ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా?
భారత క్రికెట్‌లో, ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో ఒకరైన సంజు శాంసన్ ప్రస్తుతం తన విండో ట్రేడింగ్ కారణంగా వార్తల్లో నిలిచారు. మీడియా నివేదికల ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, శామ్ కరన్ స్థానంలో సంజు శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Sanju Samson : భారత క్రికెట్‌లో, ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో ఒకరైన సంజు శాంసన్ ప్రస్తుతం తన విండో ట్రేడింగ్ కారణంగా వార్తల్లో నిలిచారు. మీడియా నివేదికల ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, శామ్ కరన్ స్థానంలో సంజు శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ గనుక నిజమైతే సంజు శాంసన్ ఐపీఎల్‌లో యెల్లో జెర్సీ ధరించడం ఇదే మొదటిసారి అవుతుంది. మరి సీఎస్కేలోకి వెళ్లడానికి ముందు సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి ఎంత మొత్తం సంపాదించాడో తెలుసా ?
సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ పార్టనర్షిప్ మొత్తం 11 సీజన్‌లది. అతను మొదట 2013, 2014, 2015 సీజన్‌ల కోసం రాజస్థాన్ రాయల్స్‌తో కలిశాడు. ఆపై 2018 నుంచి అతను ఐపీఎల్ 2025 వరకు నిరంతరం రాజస్థాన్ రాయల్స్‌తోనే ఉన్నాడు. సంజూ శాంసన్ ఐపీఎల్లో తన అరంగేట్రం 2012 సీజన్‌లో కేకేఆర్ తరఫున చేశాడు. ఆ తర్వాత అతను 2016, 2017 సీజన్‌లలో ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున ఆడాడు.
తన 15 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్‌లో సంజూ శాంసన్ 11 సంవత్సరాలు కేవలం రాజస్థాన్ రాయల్స్ తరఫునే ఆడాడు. అయితే ఈ 11 సంవత్సరాలలో అతను రాజస్థాన్ రాయల్స్ నుంచి ఎంత డబ్బు సంపాదించాడు? రాజస్థాన్ రాయల్స్ నుంచి అతని మొత్తం సంపాదన 11 సంవత్సరాలలో రూ. 93 కోట్లు. ఇందులో ఒకే సీజన్‌లో అత్యధికంగా రూ. 18 కోట్లు ఐపీఎల్ 2025లో సంపాదించాడు.
2013లో రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్‌ను తమతో చేర్చుకున్నప్పుడు, అతనికి రూ.కోటి ఇచ్చింది. ఆ తర్వాత రెండు సీజన్‌లలో అతనికి రూ. 4కోట్లు లభించాయి. 2 సంవత్సరాల విరామం తర్వాత 2018లో అతను మళ్ళీ రాజస్థాన్ రాయల్స్‌తో చేరినప్పుడు అతనికి రూ.8 కోట్లు ఇచ్చారు. ఇదే మొత్తం అతనికి తదుపరి మూడు సీజన్‌లలో కూడా లభించింది. ఐపీఎల్ 2022లో సంజూ శాంసన్ జీతం రూ.14 కోట్లకు పెరిగింది. ఈ మొత్తం అతనికి ఐపీఎల్ 2024 వరకు రాజస్థాన్ రాయల్స్ నుంచి లభించింది. అయితే, ఐపీఎల్ 2025 లో అతనికి రూ. 18 కోట్లు దక్కాయి.
రాజస్థాన్ రాయల్స్ నుంచి మొత్తం రూ. 93 కోట్లు సంపాదించిన తర్వాత, సంజూ శాంసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళ్ళే వార్తలు వస్తున్నాయి. ఇది జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో అతని నాలుగవ టీమ్ అవుతుంది. అతని కెరీర్లో కేకేఆర్, ఢిల్లీ తర్వాత రాజస్థాన్, ఇప్పుడు సీఎస్కే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




