Yash Dayal : ఐదేళ్ల సంబంధం, అబద్ధపు వాగ్దానాలు..యువతి ఆరోపణల కేసులో యష్ దయాల్ అరెస్ట్ తప్పదా ?
భారత క్రికెటర్ యష్ దయాల్‌పై రేప్ ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గజియాబాద్ మహిళ చేసిన ఈ సంచలన ఆరోపణలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదేళ్లుగా సంబంధం ఉందని, అబద్ధపు వాగ్దానాలు చేశాడని యువతి చెబుతోంది. యష్ దయాల్ అరెస్ట్ అవుతాడా లేదా అనేది దర్యాప్తు పూర్తయ్యాక తెలుస్తుంది.

Yash Dayal : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఓ వార్త కలకలం రేపుతోంది. యువ క్రికెటర్ యష్ దయాల్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. తన మీద ఓ మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేశారు. దీంతో అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కొద్ది రోజుల క్రితం గజియాబాద్‌కు చెందిన ఈ మహిళ యష్ దయాల్‌పై మానసిక, భావోద్వేగ, శారీరక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఇప్పుడు పోలీసుల తాజా ప్రకటన ప్రకారం.. ఎఫ్‌ఐఆర్‌లో యష్ దయాల్‌పై లైంగిక ఆరోపణలు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాధిత యువతి మొదటిసారిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. తనను మోసం యష్ దయాల్ చేశాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. గత ఐదేళ్లుగా యష్ దయాల్‌తో తనకు సంబంధం ఉందని కూడా ఆమె తెలిపింది. ఈ యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే పోలీసులు ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.
భారత క్రికెటర్లపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ కేసులో ఆ మహిళ కొన్ని ఫోటోలు, కాల్ రికార్డులను సాక్ష్యంగా పోలీసులకు సమర్పించినట్లు తెలుస్తోంది. వీటిని ఆధారంగా చేసుకుని యష్ దయాల్ తనను అబద్ధపు వాగ్దానాలతో నమ్మించి, ఆ నెపంతోనే శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా, తాను యష్ దయాల్ కుటుంబ సభ్యులను కూడా కలిశానని, వారి మధ్య బంధం బలమైనదని యువతి వాదించింది. ఈ ఆరోపణలు కేసు తీవ్రతను మరింత పెంచుతున్నాయి.
ప్రస్తుతం అందరి మదిలో యష్ దయాల్ అరెస్ట్ అవుతాడా? అన్న ప్రశ్న మెదలుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు అతని అరెస్ట్ జరగలేదు. అయితే, పోలీసులు ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓ ప్రముఖ మీడియా నివేదిక ప్రకారం, యష్ దయాల్ ఇప్పటికే పోలీసుల ముందు తన వాంగ్మూలం ఇచ్చాడు. యష్ దయాల్ చివరిసారిగా ఐపీఎల్ 2025లో ఒక ఆడాడు. ఆ టోర్నమెంట్‌లో అతని జట్టు ఫైనల్‌లో పంజాబ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ ఆరోపణలు అతని కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో, కేసు దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..




