Watch Video: 75 బంతుల్లో 7 సిక్స్‌లు, 4 ఫోర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. నయా ‘గంగూలీ’ నాటు కొట్టుడుకి బౌలర్లు బలి..
అప్పట్లో గంగూలీ ముందుకు వచ్చి స్పిన్నర్ల లైన్ లెంగ్త్‌ను చెడగొట్టి మరీ, సిక్సులు బాదడం చూసిన అభిమానులు ఉప్పొంగిపోయేవారు. అచ్చం ఆయనలాగే..
న్యూజిలాండ్‌కు చెందిన గంగూలీ.. అదేంటి, మన దాదాను అలా అంటున్నారని ఆశ్చర్యపోతున్నారా.. అక్కడికే వస్తున్నాం.. న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్‌మన్‌ను కూడా గంగూలీ అనే అంటుంటారు. ఎందుకంటే ఆయన బ్యాటింగ్ చూస్తే, అచ్చం దాదా శైలిలోనే ఉంటుంది. ఎడమచేత్తో ప్రత్యర్థులను చిత్తు చేసే విధానం కూడా సేమ్ టూ సేమ్ అలానే ఉంటుంది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్క్ చాప్‌మన్ తుఫాన్ సెంచరీ చేయడం ద్వారా స్కాట్లాండ్ టీం విధించిన భారీ స్కోర్‌ను ఛేదించడమే కాకుండా, ఆ జట్టు ఓటమికి కీలక పాత్ర పోషించాడు.
మార్క్ చాప్‌మన్, మిచెల్ సెంచరీ భాగస్వామ్యం..
స్కాట్లాండ్‌తో జరిగిన ఏకైక వన్డేలో మార్క్ చాప్‌మన్ అద్భుత సెంచరీ సాధించాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 75 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేశాడు. చాప్‌మన్ తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 134 కంటే ఎక్కువ ఉంది. ఈ ఇన్నింగ్స్ చూస్తే స్కాట్లాండ్ బౌలర్లను ఎలా ముప్పతిప్పలు పెట్టాడో తెలిసిపోతుంది. అతడితో పాటు డారెల్ మిచెల్ 74 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చాప్‌మన్, మిచెల్ సెంచరీ భాగస్వామ్యంతో న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.
View this post on Instagram
చాప్‌మన్ శైలి గంగూలీలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆటగాడు స్పిన్నర్లపై అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. అప్పట్లో గంగూలీ ముందుకు వచ్చి స్పిన్నర్ల లైన్ లెంగ్త్‌ను చెడగొట్టి మరీ, సిక్సులు బాదడం చూసిన అభిమానులు ఉప్పొంగిపోయేవారు. అచ్చం ఆయనలాగే ఆడిన చాప్‌మన్ కూడా ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. స్కాట్లాండ్‌పై చాప్‌మన్ అదే విధంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పటి వరకు ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లోనే అభిమానులతోపాటు విమర్శకులను సైతం మొప్పించాడు. చాప్‌మన్ కేవలం 7 ODI ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు సాధించాడు. అతని సగటు కూడా 50కి మించి ఉంది. స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనే ఈ ఆటగాడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రెండో టీ20లో చాప్‌మన్ 44 బంతుల్లో 83 పరుగుల ఇన్నింగ్స్ ఆడి న్యూజిలాండ్‌కు రికార్డు స్థాయిలో 102 పరుగుల విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్ టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అలాగే ఒకే ఒక్క వన్డే మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నారు.