AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson : వరల్డ్ కప్ హీరో.. ఐపీఎల్‌లో జీరో.. తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్

Sanju Samson : టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ 2026లో సీఎస్‌కే తరపున వరుసగా విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు. తన పాత బలహీనతలతో వికెట్లు పారేసుకుంటూ విమర్శల పాలవుతున్నాడు.

Sanju Samson : వరల్డ్ కప్ హీరో.. ఐపీఎల్‌లో జీరో.. తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
Sanju Samson
Rakesh
|

Updated on: Apr 07, 2026 | 9:32 AM

Share

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియాను తన అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్.. ఐపీఎల్ 2026లో మాత్రం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి మారిన తర్వాత, తన కొత్త హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో సంజూ మ్యాజిక్ చేస్తాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమవడమే కాకుండా, తన పాత బలహీనతలతో వికెట్లు పారేసుకుంటూ విమర్శల పాలవుతున్నాడు.

కొద్దిరోజుల క్రితమే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జింబాబ్వే, వెస్టిండీస్, న్యూజిలాండ్ వంటి జట్లపై వరుసగా 97 నాటౌట్, 89, 89 పరుగులు చేసి భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. ఆ ఫామ్‌తోనే చెన్నై సూపర్ కింగ్స్‌లో అడుగుపెట్టిన సంజూపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేరళకు చెందిన వాడు కావడంతో తమిళనాడు అభిమానులు అతడిని తమ సొంత బిడ్డలా భావించి చెపాక్ స్టేడియంలో సంజూ.. సంజూ.. అంటూ హోరెత్తించారు. కానీ, ఐపీఎల్ మొదలైన పది రోజుల్లోనే సీన్ రివర్స్ అయింది.

సీఎస్‌కే తరపున ఆడిన మొదటి మూడు ఇన్నింగ్స్‌ల్లో సంజూ వరుసగా 6, 7, 9 పరుగులు మాత్రమే చేశాడు. అంటే మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 22 పరుగులు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి పవర్ ప్లేలో మెరుపులు మెరిపిస్తాడనుకుంటే, అనవసరమైన షాట్లకు ప్రయత్నిస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, వికెట్ కీపింగ్‌లో కూడా సంజూ తడబడుతున్నాడు. ధోనీ గైర్హాజరీలో కీపింగ్ బాధ్యతలు చేపట్టిన శాంసన్, సులభమైన బంతులను కూడా అందుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రపంచకప్‌లో ఎంతో ప్రశాంతంగా బ్యాటింగ్ చేసిన సంజూ, ఐపీఎల్‌లో మాత్రం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సీఎస్‌కే అభిమానుల విపరీతమైన ప్రేమను చూసి, మొదటి మ్యాచ్‌లోనే ఏదో చేసేయాలనే ఆరాటంలో అతిగా ప్రయత్నించి తప్పులు చేస్తున్నాడని ఆర్. కౌశిక్ తన విశ్లేషణలో పేర్కొన్నారు. బంతిని దాని మెరిట్ ప్రకారం ఆడకుండా, బలవంతంగా ఆఫ్‌సైడ్ దిశగా రూమ్ చేసుకుని షాట్లు కొట్టబోయి అవుట్ అవుతున్నాడు. తన సహజ సిద్ధమైన ఆటను మరిచిపోయి, అంచనాల భారంతో సతమతమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

సంజూ ఫామ్ కోల్పోయినప్పటికీ, సీఎస్‌కే మేనేజ్మెంట్ మాత్రం అతడికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. “చాలా కాలం ఒకే ఫ్రాంచైజీ (రాజస్థాన్)లో ఉండి కొత్త టీమ్‌లోకి వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు సహజం. సంజూ జట్టులో బాగా కలిసిపోయాడు, పరుగులు చేయాలనే కసి అతడిలో ఉంది. అతడిపై మాకు పూర్తి నమ్మకం ఉంది, త్వరలోనే శాంసన్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు” అని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే మ్యాచ్‌ల్లో సంజూ తన పాత ప్రపంచకప్ వీడియోలను చూసి, ఆ ప్రశాంతతను మళ్ళీ తెచ్చుకుంటేనే సీఎస్‌కే కష్టాలు తీరుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్