సంజూ శాంసన్‌ను కలవాలన్న దివ్యాంగ చిన్నారి.. టీమిండియా క్రికెటర్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో

టీమిండియా వికెట్‌ కీపర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. ఒక దివ్యాంగ చిన్నారి కోరికను నెరవెర్చి అతని కళ్లల్లో ఆనందం నింపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారగా, సంజూ శామ్సన్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

సంజూ శాంసన్‌ను కలవాలన్న దివ్యాంగ చిన్నారి.. టీమిండియా క్రికెటర్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో
Sanju Samson

Updated on: Mar 04, 2024 | 1:56 PM

టీమిండియా వికెట్‌ కీపర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. ఒక దివ్యాంగ చిన్నారి
కోరికను నెరవెర్చి అతని కళ్లల్లో ఆనందం నింపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారగా, సంజూ శామ్సన్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. దివ్యాంగ చిన్నారి అయిన ఓ బాలుడు తన ప్రతిభా పాటవాలతో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాడు. కాళ్లూ చేతులూ ఏ మాత్రం సహకరించకపోయినా ఫుట్ బాల్, క్రికెట్ వంటి గేమ్స్ ఆడడం, పియానో వాయించడం వంటి మల్టీ ట్యాలెంటెడ్ పనులు చేస్తూ పలువురి ప్రశంసలు పొందాడు. తన ప్రతిభకు గుర్తింపుగా ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు పొందాడు. అయితే తనకు సంజూ శాంసన్ ను కలవాలన్న చిరకాల కోరిక ఉందంటూ చిన్నారి చెబుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారాయి. ఈ విషయం సంజూ శామ్సన్ దృష్టికి కూడా వెళ్లింది. చిన్నారి చిరు కోరికపై స్పందించిన శామ్సన్ వెంటనే ఆ పిల్లాడిని కలిశాడు. అతేకాకుండా చాలా సేపు అతనితో క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సంజూశామ్సన్ చాలా మంచి పని చేశాడంటూ టీమిండియా క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

కేరళకు చెందిన సంజూ శాంసన్‌ ఇప్పుఉ ఐపీఎల్‌-2024కు సన్నద్ధమవుతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే తోటి సహచరులతో కలిసి ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. ఎంతో ట్యాలెంట్ ఉన్నా టీమిండియాలో చోటు నిలుపుకోలేకపోతున్నాడు సంజూశామ్సన్. అతను చివరిగా దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా జెర్సీతో కనిపించాడు. మూడు మ్యాచ్‌ ల సిరీస్ లో భాగంగా తన మొదటి ఇంటర్నేషనల్ సెంచరీ సాధించాడు. ఆ తనకవాత జనవరిలో అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20 సందర్భంగా ఆఖరిగా భారత్‌ తరఫున మ్యాచ్‌ ఆడాడు సంజూ శామ్సన్.

మల్టీ ట్యాలెంటెడ్ కిడ్..

చిన్నారితో క్రికెట్ ఆడుతున్న సంజూ శామ్సన్..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..