AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: కోహ్లీకి సుస్సు పోయించినా.. వేలంలో అమ్ముడవ్వలే.. కట్‌చేస్తే.. రూ.10 కోట్ల ప్లేయర్ స్థానంలో రీఎంట్రీ..

Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2023 కోసం తమ జట్టులో విరాట్ కోహ్లీకి చుక్కలు చూపించిన ఆటగాడిని చేర్చుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది.

IPL 2023: కోహ్లీకి సుస్సు పోయించినా.. వేలంలో అమ్ముడవ్వలే.. కట్‌చేస్తే.. రూ.10 కోట్ల ప్లేయర్ స్థానంలో రీఎంట్రీ..
Sandeep Sharma
Venkata Chari
|

Updated on: Mar 27, 2023 | 8:12 PM

Share

సంజూ శాంసన్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ గత ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌లోకి అడుగుపెట్టినప్పటికీ.. ఆ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడిపోయింది. రాజస్థాన్ జట్టు ఫైనల్స్‌కు చేరడం ఇది రెండోసారి. అంతకుముందు ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ ఫైనల్‌కు చేరి టైటిల్ కూడా గెలుచుకుంది. IPL-2023లో ఈ జట్టు మళ్లీ ఫైనల్ ఆడేందుకు ప్రయత్నిస్తుంది. టైటిల్‌ను కూడా గెలుచుకోవాలని కోరుకుంటోంది. దీని కోసం తన పదునైన బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఆటగాడిని తన జట్టులో చేర్చుకుంది. రాజస్థాన్ తన జట్టులో సందీప్ శర్మను చేర్చుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.

గత సీజన్‌లో రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రసీద్ధ్ కృష్ణ ఈ సీజన్‌లో గాయపడటంతో ఐపీఎల్-2023లో ఆడడం లేదు. అతని స్థానంలో రాజస్థాన్ టీం సందీప్‌ను జత చేసింది. సందీప్ చేరడం గురించి ఫ్రాంచైజీ సోమవారం ట్వీట్ ద్వారా తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో అద్భుతమైన రికార్డు..

సందీప్ ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తరపున మాత్రమే ఐపీఎల్ ఆడాడు. రాజస్థాన్ అతని మూడో జట్టు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌కి ఐపీఎల్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు విరాట్ కోహ్లీని అవుట్ చేసిన బౌలర్‌గా పేరుగాంచాడు. ఇప్పటికి ఏడుసార్లు ఐపీఎల్‌లో కోహ్లీని బలిపశువుగా చేసుకున్నాడు. అంతే కాకుండా ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ బౌలర్ ఐపీఎల్ పవర్‌ప్లేలో మొత్తం 53 వికెట్లు తీశాడు. 54 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ అతని కంటే ముందున్నాడు. భువనేశ్వర్, సందీప్ కలిసి హైదరాబాద్‌ తరపున ఆడారు.

వేలంలో అమ్మడవ్వలే..

IPL-2023 వేలంలో సందీప్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. అతని బేస్ ధర రూ. 50 లక్షలు. కానీ, అతను ఇప్పుడు IPLలోకి ప్రవేశించాడు. రూ.10 కోట్ల విలువైన ఆటగాడిని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణను ఐపీఎల్-2022 వేలంలో రాజస్థాన్ రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను కాలికి గాయం కారణంగా ఈ సీజన్‌లో ఆడడంలేడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ