రాయల్స్ పై సన్‌‌‌రైజర్స్ గెలుపు

రాయల్స్ పై సన్‌‌‌రైజర్స్ గెలుపు

సొంతగడ్డపై సన్‌‌‌రైజర్స్ బోణీ మళ్ళీ చెలరేగిన వార్నర్ రాణించిన బెయిర్‌స్టో, విజయ్ శంకర్ శాంసన్ సెంచరీ వృధా   హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో సన్‌‌‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయంతో బోణి కొట్టింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో రాయల్స్ పై  5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాయల్స్ […]

Ravi Kiran

|

Mar 30, 2019 | 11:01 AM

  • సొంతగడ్డపై సన్‌‌‌రైజర్స్ బోణీ
  • మళ్ళీ చెలరేగిన వార్నర్
  • రాణించిన బెయిర్‌స్టో, విజయ్ శంకర్
  • శాంసన్ సెంచరీ వృధా

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో సన్‌‌‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయంతో బోణి కొట్టింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో రాయల్స్ పై  5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ రహానే (70; 49 బంతుల్లో) అర్ధ సెంచరీతో, సంజూ శాంసన్ (102; 55 బంతుల్లో) అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, నదీమ్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (69; 37 బంతుల్లో), బెయిర్‌స్టో (45; 28 బంతుల్లో) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. దీనితో సన్‌‌‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (35; 15 బంతుల్లో) తుఫాన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. కాగా రషీద్ ఖాన్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu