AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: చెలరేగిన సుదర్శన్‌, మిల్లర్.. గుజరాత్‌ గ్రాండ్‌ విక్టరీ.. వార్నర్‌ సేనకు తప్పని నిరాశ

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ అదరగొడుతోంది. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు  తాజా సీజన్ లో వరుసగా రెండో విజయం సాధించింది.  మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2023: చెలరేగిన సుదర్శన్‌, మిల్లర్.. గుజరాత్‌ గ్రాండ్‌ విక్టరీ.. వార్నర్‌ సేనకు తప్పని నిరాశ
Delhi Capitals vs Gujarat Titans
Basha Shek
|

Updated on: Apr 05, 2023 | 5:25 AM

Share

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ అదరగొడుతోంది. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు  తాజా సీజన్ లో వరుసగా రెండో విజయం సాధించింది.  మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వృద్ధిమాన్‌ సాహా (14), శుభ్‌మన్‌ గిల్‌ (14), హార్ధిక్‌ పాండ్యా (5) తక్కువ స్కోరుకే ఔటైనా తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్‌(48 బంతుల్లో 62 నాటౌట్‌, 4 ఫోర్లు 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో మెరిశాడు. విజయ్‌శంకర్‌( 23 బంతుల్లో 29) కూడా రాణించగా, డేవిడ్‌ మిల్లర్‌(16 బంతుల్లో 31 నాటౌట్‌, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఎప్పటిలాగే దూకుడుగా ఆడాడు. దీంతో 11 బంతులు ఉండగానే హార్ధిక్‌ సేన విజయం సాధించింది. అంతకుముందు విజయ్‌శంకర్‌(29) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఆన్రిచ్‌ నార్జ్‌ రెండు, ఖలీల్‌ అహ్మద్‌, మిచెల్ మార్ష్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా ఈ సీజన్‌లో వార్నర్‌ సేనకు ఇది వరుసగా రెండో ఓటమి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ (37; 32 బంతుల్లో 7 ఫోర్లు), సర్ఫరాజ్ ఖాన్ (30; 34 బంతుల్లో) రాణించగా మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. ఆఖర్లో అక్షర్‌ పటేల్ (36; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అర్ధసెంచరీతో గుజరాత్‌ను గెలిపించిన సాయి సుదర్శన్‌కు ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బైక్‌లో నుంచి అలికిడి.. దగ్గరకెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..