Virat Kohli: ‘ఆనాడు పాదాలు తాకావు.. నేడు నా హృదయాన్ని టచ్ చేశావు’

ఈ మైలురాయిని చేరుకున్న తర్వాత, కోహ్లి ఒక్కసారిగా టెండూల్కర్‌కు తల వంచి నమస్కరించాడు. స్టాండ్స్ నుంచి లిటిల్ మాస్టర్ హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టాడు. కోహ్లి డీప్‌లో ఔట్ అయ్యే ముందు మరో 10 పరుగులు జోడించాడు. కానీ, అప్పటికి అతను భారత్‌ను బలమైన స్కోరుకు చేర్చాడు. శ్రేయాస్ కూడా తన సెంచరీని సాధించడంతో ఆ స్థానం మరింత మెరుగుపడింది.

Virat Kohli: ఆనాడు పాదాలు తాకావు.. నేడు నా హృదయాన్ని టచ్ చేశావు
Team India Vs New Zealand Virat Kohli Sachin

Edited By:

Updated on: Nov 18, 2023 | 6:03 PM

Sachin Tendulkar Tweet: వాంఖడే స్టేడియం మాత్రమే కాదు.. టీవీల ముందు కూర్చున్న ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తోన్న కోహ్లీ 50 వ సెంచరీ ఎట్టకేలకు నాకౌట్ మ్యాచ్‌లో వచ్చింది. దీంతో కింగ్ కోహ్లీ కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు అయితే, అందుకోసం.. ఎప్పటిలాగే మెరుపులా పరుగెత్తాడు. విరాట్ కోహ్లీ కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో అడ్డంగా షఫుల్ చేసి, డెలివరీని బ్యాక్‌వర్డ్ స్క్వేర్-లెగ్‌కి మళ్లించాడు. సింగిల్‌ను ఊపిరి పీల్చుకోలేని వేగంతో అంటే చిరుతలా పూర్తి చేశాడు. ఆపై అతను తన రెండవ పరుగు కోసం వెనుదిరిగాడు. అది అతని 50వ ODI శతకాన్ని అందించింది. ముఖ్యంగా కోహ్లీ ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ గతంలో ఉన్న 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తూ.. దూసుకపోయాడు.

భారత బ్యాటింగ్ చరిత్రలో, కోహ్లి తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. బుధవారం సాయంత్రం ఇక్కడి వాంఖడే స్టేడియంలో 50వ సెంచరీని అందుకున్నాడు. అది కూడా తన హీరో సచిన్ ముందు తన రికార్డ్‌నే బ్రేక్ చేశాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ క్రమంలో సచిన్ ఓ ట్వీట్ చేశాడు. అందులో.. ‘నేను నిన్ను ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో మొదటిసారి కలిసినప్పుడు, ఇతర సహచరులు నా పాదాలను తాకమంటూ ఆటపట్టించారు. ఆ రోజు నేను నవ్వు ఆపుకోలేకపోయాను. కానీ త్వరలో, నీ అభిరుచి, నైపుణ్యంతో నా హృదయాన్ని తాకావు. ఆనాటి ఆ కుర్రాడు ‘విరాట్’ ది గ్రేట్ ప్లేయర్‌గా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నా రికార్డును భారతీయుడు బద్దలు కొట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అది కూడా నా హోమ్ గ్రౌండ్‌లో బ్రేక్ చేయడం అద్భుతంగా ఉంది’ అంటూ రాసుకొచ్చాడు.

ఈ మైలురాయిని చేరుకున్న తర్వాత, కోహ్లి ఒక్కసారిగా టెండూల్కర్‌కు తల వంచి నమస్కరించాడు. స్టాండ్స్ నుంచి లిటిల్ మాస్టర్ హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టాడు. కోహ్లి డీప్‌లో ఔట్ అయ్యే ముందు మరో 10 పరుగులు జోడించాడు. కానీ, అప్పటికి అతను భారత్‌ను బలమైన స్కోరుకు చేర్చాడు. శ్రేయాస్ కూడా తన సెంచరీని సాధించడంతో ఆ స్థానం మరింత మెరుగుపడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..