Sachin Tendulkar: క్రికెట్ దేవుడు సృష్టించిన ఆ అరుదైన రికార్డుకు 20 ఏళ్లు..పూర్తి వివరాలు

Sachin Tendulkar Record: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. 2001 మార్చి 31న ఇందోర్‌లోని నెహ్రూ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

Sachin Tendulkar: క్రికెట్ దేవుడు సృష్టించిన ఆ అరుదైన రికార్డుకు 20 ఏళ్లు..పూర్తి వివరాలు
Sachin Tendulkar Record
Follow us

|

Updated on: Mar 31, 2021 | 11:15 AM

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 2001 మార్చి 31న ఇందోర్‌లోని నెహ్రూ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ బ్యాట్స్‌మన్ ఈ ఘనత సాధించాడు. నాటి మ్యాచ్‌లో హైదరాబాద్ సొగసరి ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి సచిన్ 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. శతకం బాదడంతో సచిన్ వన్డే‌ల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడయ్యాడు. తన 259వ వన్డే ఇన్నింగ్స్‌లో మాస్టర్ బ్యాట్స్‌మన్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. నాటి మ్యాచ్‌లో సచిన్ టెండుల్కర్ 139 పరుగులతో రాణించడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా కేవలం 181 పరుగులకే ఆలౌట్ కావడంతో 118 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది.

క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్లలో ఒకరుగా సచిన్ టెండుల్కర్ గుర్తింపు పొందారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిటే ఉంది. వన్డేల్లో 18,426 పరుగులు, టెస్ట్ మ్యాచ్‌లలో 15,921 పరుగులు సాధించాడు మాస్టర్ బ్లాస్టర్. తాను ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో సచిన్ 10 పరుగులు సాధించాడు.

2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండుల్కర్…తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 100 శతకాలు నమోదు చేసుకున్నాడు. వన్డేల్లో 51 శతకాలు, టెస్ట్‌లో 49 శతకాలు బాదాడు. 200 టెస్ట్ మ్యాచ్‌లు, 463 వన్డే మ్యాచ్‌లు, ఒక టీ20లో భారత జట్టుకు సచిన్ ప్రాతినిథ్యంవహించాడు.

తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు గత వారం సచిన్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. సచిన్ త్వరగా కోలుకోవాలంటూ పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు విషెస్ తెలిపారు. సచిన్ త్వరగా కరోనా బారి నుంచి కోలుకోవాలంటూ పాక్ మాజీ ఫేస్ దిగ్గజం షోయిబ్ అక్తర్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. సచిన్‌తో కలిసి తాను క్రికెట్ ఆడుతున్న ఫోటోను షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి…Bank Holidays In April 2021: తెలుగు రాష్ట్రాల బ్యాంక్ వినియోదారులు బీ ఎలర్ట్.. ఏప్రిల్ లో ఎన్నిరోజులు బ్యాంక్ లకు సెలవులంటే..!

India Corona Cases Update: భయపెట్టిస్తున్న కరోనా సెకండ్ వేవ్‌.. దేశంలో పెరిగిన మరణాల సంఖ్య.. తాజాగా ఎన్ని కేసులంటే..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?