AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Finn Allen: గతంలో 20 బంతుల్లో 102 పరుగులు, ఇప్పుడు ఫ్లడ్‌లైట్ల పైనుంచి భారీ సిక్సర్.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో తన పేరును కూడా చేర్చుకున్నాడు.  దేశీయ క్రికెట్‌లో అనేక మెరుపుల తరువాత,

Finn Allen: గతంలో 20 బంతుల్లో 102 పరుగులు, ఇప్పుడు ఫ్లడ్‌లైట్ల పైనుంచి భారీ సిక్సర్.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్
ఫిన్ ఆలిన్
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2021 | 12:58 PM

Share

Finn Allen Out Of the park six: న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో తన పేరును కూడా చేర్చుకున్నాడు.  దేశీయ క్రికెట్‌లో అనేక మెరుపుల తరువాత, ఇప్పుడు అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి కూడా అడుగు పెట్టాడు. ఫిన్ బంగ్లాదేశ్‌తో జరిగే టీ 20 సిరీస్‌లో ఆడే అవకాశం వచ్చింది. అతను మొదటి మ్యాచ్‌లో పెద్దగా  ఆకట్టుకోలేకపోయినప్పటికీ, రెండవ మ్యాచ్‌లో తన మార్క్ చూపించాడు. చేసింది తక్కువ స్కోరే అయినప్పటికీ, దూకుడైన బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. ఐపిఎల్‌లో కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అలెన్ సభ్యుడిగా ఉన్నాడు.

మంగళవారం ఆడిన రెండో టి 20 మ్యాచ్‌లో ఫిన్ 10 బంతుల్లో 17 పరుగులు చేసినప్పటికీ,  టాస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో బాదిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. పిన్ తన ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టాడు.  టాస్కీన్ అహ్మద్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా, తన మొదటి ఓవర్ వేసేందుకు వచ్చాడు. ఈ ఓవర్  మొదటి బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా గ్రౌండ్ బయటకు పంపాడు అలెన్. అంత భారీ సిక్సర్ చూసి బంగ్లాదేశ్ ఆటగాళ్లు నోరెళ్లబెట్టారు.

59 బంతుల్లో 128 పరుగులు

ఫిన్ అలెన్ ఇటీవల 50 ఓవర్ల దేశీయ టోర్నమెంట్ ఫోర్డ్ ట్రోఫీలో అద్భుతమైన సెంచరీ సాధించాడు.  59 బంతుల్లో 128 పరుగులు చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మ్యాచ్‌లో అతను 11 సిక్సర్లు, 9 ఫోర్లు కొట్టాడు. అంటే 20 బంతుల్లో ఫోర్లు, సిక్సర్ల సహాయంతో 102 పరుగులు చేశాడు. ఫిన్ అవుట్ అయినప్పుడు, 20.3 ఓవర్లలో జట్టు స్కోర్ 191 గా ఉంది. అందులో ఫిన్ మాత్రమే 128 పరుగులు చేశాడు.

Also Read: జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా ?.. డోంట్ వర్రీ.. పరిష్కారం ఇదిగో..!

అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? ఈ ప్రయోజనాలు తెలిస్తే చుక్క కూడా వేస్ట్ చెయ్యరు