AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virender Sehwag: సచిన్, గంగూలీ, లక్ష్మణ్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేకపోతే.. ఫిట్‌నెస్ టెస్టుపై సెహ్వాగ్ హాట్ కామెంట్స్

భారత మాజీ క్రికెట్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జట్టలోకి ఆటగాళ్ల  ఎంపిక ప్రక్రియపై పెదవి విరిచారు . ప్రస్తుతం, ఏదైనా ఆటగాడు మ్యాచ్ ఆడటానికి యో-యో పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

Virender Sehwag: సచిన్, గంగూలీ, లక్ష్మణ్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేకపోతే.. ఫిట్‌నెస్ టెస్టుపై సెహ్వాగ్ హాట్ కామెంట్స్
Sehwag
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2021 | 1:55 PM

Share

Yo-Yo Test :భారత మాజీ క్రికెట్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జట్టలోకి ఆటగాళ్ల  ఎంపిక ప్రక్రియపై పెదవి విరిచారు . ప్రస్తుతం, ఏదైనా ఆటగాడు మ్యాచ్ ఆడటానికి యో-యో పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఈ పరీక్ష ఆటగాడి ఫిట్‌నెస్‌కు సంబంధించినది. అయితే ఫిట్‌నెస్ కంటే టాలెంట్ ముఖ్యమని సెహ్వాగ్ ‘క్రికెట్‌బజ్’తో మాట్లాడుతూ అన్నారు. అలాగే, యో-యో పరీక్ష ఇంతకు ముందే జరిగి ఉంటే.. సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, గంగూలీ ఎప్పటికీ ఉత్తీర్ణత సాధించలేరు అని సెహ్వాగ్ చెప్పారు.

సెహ్వాగ్ అసలు ఏమి చెప్పాడు?

“యో-యో పరీక్షలో పాస్ అవ్వనందున.. అశ్విన్,  చక్రవర్తి అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేకపోవచ్చు. కానీ నేను ఈ వాదనను ఏకీభవించను. ఆటగాళ్లను ఎన్నుకోవటానికి జట్టుకు ఇలాంటి ప్రమాణాలు ఉంటే.. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ఎప్పటికీ ఉత్తీర్ణత సాధించలేరు. ఈ ముగ్గురు సీనియర్స్..బీఫ్- (మల్టీస్టేజ్ ఫిట్‌నెస్ టెస్ట్) పరీక్షల్లో పాస్ అవ్వడం నేను చూడలేదు. బీప్ పరీక్షకు 12.5 పాయింట్లు అవసరం. కానీ సచిన్, గంగూలీ, లక్ష్మణ్ 10 లేదా 11 పాయింట్లు సాధించేవారు. అయితే, ఈ ఆటగాళ్ల స్కిల్స్ మాత్రం అద్భుతం ”అని సెహ్వాగ్ చెప్పాడు.

“ఫిట్‌నెస్ కంటే నైపుణ్యం ముఖ్యమని నా అభిప్రాయం. మీ జట్టులో ఆటగాళ్లు ఫిట్‌నెస్‌తో ఉండి.. మీరు ప్రతి మ్యాచ్‌లో ఓడిపోతుంటే ఏం చేస్తారు.  ఆటగాళ్లకు నైపుణ్యం లేకపోతే.. ఫిట్‌నెస్‌తో ఉన్నా వేస్ట్.  నైపుణ్యంతో బ్యాటింగ్, బౌలింగ్ చేసే వారు జట్టుకు ఆడాలి. ఎందుకంటే అలాంటి ఆటగాళ్ళు కష్ట సమయాల్లో మంచి ప్రదర్శన ఇవ్వగలరు. అదే సమయంలో, జట్టులో ఉంటే ఆటగాడి ఫిట్‌నెస్ క్రమంగా మెరుగుపడుతుంది ”అని సెహ్వాగ్ అన్నాడు.

సెహ్వాగ్ కామెంట్స్‌కు అజయ్ జడేజా మద్దతు…

ఈ విషయంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా వీరేందర్ సెహ్వాగ్‌కు మద్దతు ఇచ్చారు. “మీరు కుక్ కోసం చూస్తున్నట్లయితే, ముందుగా అతని వంట నైపుణ్యాలను చూస్తారు. మొదట పరిగెత్తమని అతనికి చెప్పరు. ప్రతిభ చాలా ముఖ్యమైన విషయం ”అని జడేజా అన్నాడు.

Also Read: గతంలో 20 బంతుల్లో 102 పరుగులు, ఇప్పుడు ఫ్లడ్‌లైట్ల పైనుంచి భారీ సిక్సర్.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్

చేష్టలతో నవ్వు తెప్పించడం వాటికి అలవాటేగా.. ఈ వానరం స్టైల్‌తో నవ్వించింది.. మీరే చూడండి