Viral Video: చేష్టలతో నవ్వు తెప్పించడం వాటికి అలవాటేగా.. ఈ వానరం స్టైల్‌తో నవ్వించింది.. మీరే చూడండి

కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? అవి ఎక్కడ ఉన్నా తమ ఉనికిని చాటుతూనే ఉంటాయి.  అడవిలో అల్లరి చేస్తూ.. పెద్ద, పెద్ద జంతువులకు మస్కా కొడతాయి వానరాలు.

Viral Video: చేష్టలతో నవ్వు తెప్పించడం వాటికి అలవాటేగా.. ఈ వానరం స్టైల్‌తో నవ్వించింది.. మీరే చూడండి
Monkey Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 31, 2021 | 10:58 AM

కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? అవి ఎక్కడ ఉన్నా తమ ఉనికిని చాటుతూనే ఉంటాయి.  అడవిలో అల్లరి చేస్తూ.. పెద్ద, పెద్ద జంతువులకు మస్కా కొడతాయి వానరాలు. ఇక పల్లెల్లోకి, పట్నాల్లోకి వస్తే.. ఇళ్లు పీకి పందిరేస్తాయి. కాగా కోతులకు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఫన్నీ వీడియోలు వైరలయ్యాయి. తాజాగా ఓ ట్రెండిండ్ వీడియోని మీకోసం పట్టుకొచ్చాం. ఈ చిట్టి కోతి అల్లరికి మీరు కూడా అభిమానులవుతారు. ఇంకెందుకు ఆలస్యం దిగువన ఉన్న ఈ వీడియో చూడండి.

వీడియోలో, మేక ముందు ఒక కోతి నిలబడి ఉండడాన్ని మీరు చూడవచ్చు.  ఆ తరువాత కోతి మేక కొమ్మును పట్టుకుని కాసేపు వేలాడుతుంది. ఆ తర్వాత దాని మెడపై ఎక్కి కూర్చని.. ఏదో రేసింగ్ చేస్తున్నట్లు ఫోజ్ కొట్టింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా కూడా మేక మాత్రం సైలెంట్‌గా అలానే నిల్చని ఉండిపోయింది. ఈ  కోతి  విన్యాసాల వీడియోను సోషల్ మీడియా యూజర్లు చాలా ఇష్టపడుతున్నారు.

సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా లైక్ చేస్తున్నారు. చాలామంది వీడియోను షేర్ చేస్తూ.. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్.. ‘ఈ కోతి నాలాంటిదే’ అని రాసుకొచ్చాడు.  అదే సమయంలో, మరొక యూజర్ ఈ సంవత్సరం ‘నేను చూసిన కోతులకు.. ఇది నెక్ట్స్ వెర్షన్’ అంటూ రాసుకొచ్చాడు. ఇలా సోషల్ మీడియా ఖాతాదారులు విభిన్నమై కామెంట్స్ పెడుతూ.. వీడియోను లైక్‌ల‌లో హెరెత్తిస్తున్నారు.

Also Read: జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా ?.. డోంట్ వర్రీ.. పరిష్కారం ఇదిగో..!

అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? ఈ ప్రయోజనాలు తెలిస్తే చుక్క కూడా వేస్ట్ చెయ్యరు