Video: అరెరే.. ఎంత పనాయే.. మహిళా యాంకర్‌కు ఊహించని ప్రమాదం.. బలంగా ఢీ కొట్టిన ఇద్దరు ఫీల్డర్లు..
SA20 League Viral Video: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాకిస్థానీ మహిళ యాంకర్‌ను ఫీల్డర్స్ ఢీకొట్టారు. ఈ ఢీకొనడంతో యాంకర్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్ టౌన్ వర్సెస్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా.. ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బౌండరీని కాపాడే ప్రయత్నంలో, ఫీల్డర్ బౌండరీ వద్ద నిల్చున్న ఓ పాకిస్తాన్ మహిళా యాంకర్‌ను బలంగా ఢీకొన్నాడు. ఈ అనుకోని ఘటన తర్వాత మహిళా యాంకర్ నేలపై పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మ్యాచ్ 13వ ఓవర్‌లో సామ్ కుర్రాన్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ చివరి బంతికి మార్కో జాన్సెన్ భారీ షాట్ కొట్టాడు. ఈ బంతిని బౌండరీకివెళ్లకుండా అడ్డుకునేందుకు ఇద్దరు ఫీల్డర్లు పరుగులు తీశారు. బంతి బౌండరీ లైన్ దగ్గరకు చేరినప్పుడు, ఒక ఫీల్డర్ డైవ్ చేశాడు. ఆ ఫీల్డర్ బౌండరీ రోప్‌పై ఇంటర్వ్యూ చేస్తున్న పాకిస్తాన్ మహిళా యాంకర్ జైనాబ్ అబ్బాస్‌ను ఢీకొన్నాడు. ఈ క్రమంలో ఫీల్డర్ ఢీకొనడంతో జైనాబ్ అక్కడికక్కడే పడిపోయింది. వెంటనే ఆమెతో పాటు నిలబడి ఉన్నవారు ఆమెను పైకి లేపారు. ఈ ఊహించని ప్రమాదంలో జైనబ్ పెద్దగా గాయపడకపోవడం కాస్త ఊరట కలిగించే విషయమే. జైనబ్ పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“This is coming straight for us..” ?@ZAbbasOfficial, you good? ?@CapeTownCityFC your manager somehow avoided the contact! pic.twitter.com/32YPcfLCMf
— SuperSport ? (@SuperSportTV) January 18, 2023
పాకిస్థాన్ క్రికెటర్లకు నో ఎంట్రీ..
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మొత్తం 5 జట్లు పాల్గొంటున్నాయి. ఈ లీగ్‌లోని అన్ని జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అదే సమయంలో ఈ లీగ్‌లో పాక్ క్రికెటర్లెవరూ ఆడటానికి అనుమతి లభించలేదు. పాకిస్థాన్ మహిళా స్పోర్ట్స్ జర్నలిస్ట్ జైనాబ్ అబ్బాస్ ఈ లీగ్‌లో యాంకర్‌గా పనిచేస్తుంది. సామ్ కర్రాన్, జోఫ్రా ఆర్చర్ వంటి చాలా మంది స్టార్ ప్లేయర్లు సౌతాఫ్రికా క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..