AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: 6 ఫోర్లు, 9 సిక్స్‌లు.. 45 బంతుల్లోనే తుఫాన్ సెంచరీ.. సొంత టీంమేట్‌పై బౌండరీల వర్షం.. కోహ్లీని గుర్తుచేసిన ఆ ప్లేయర్ ఎవరంటే?

మెల్‌బోర్న్‌లో విరాట్ కోహ్లి 19వ ఓవర్‌లో పాక్ పేసర్ హరీస్ రవూఫ్‌ను సిక్సర్లతో చితక బాదిన సీన్‌ను ఎలా మర్చిపోతాం. అచ్చం ఇదే లెవల్లో అదే బౌలర్‌ను తన టీంమేట్..

Watch Video: 6 ఫోర్లు, 9 సిక్స్‌లు.. 45 బంతుల్లోనే తుఫాన్ సెంచరీ.. సొంత టీంమేట్‌పై బౌండరీల వర్షం.. కోహ్లీని గుర్తుచేసిన ఆ ప్లేయర్ ఎవరంటే?
Iftikhar Ahmed Bpl 2023
Venkata Chari
|

Updated on: Jan 20, 2023 | 9:21 AM

Share

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం లేదు. కానీ, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొంతమంది ఆటగాళ్ళు తమ ఆటతీరుతో సత్తా చాటుతున్నారు. జట్టులోని కీలక ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, హరీస్ రవూఫ్ ఈ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరే కాక మరికొంతమంది ప్లేయర్లు కూడా ఇందులో ఆడున్నారు. వారిలో ముఖ్యంగా ఇఫ్తికార్ అహ్మద్ కూడా తన సత్తా చాటుతున్నాడు. తుపాన్ బ్యాటింగ్‌తో సెంచరీ బాదడంతో.. స్టార్ ప్లేయర్లను మించిపోయాడు. సెంచరీ ఇన్నింగ్స్‌లో తన పేసర్ భాగస్వామి పాక్ జట్టు హారిస్ బౌలింగ్‌ను కూడా చిత్తు చేశాడు.

జనవరి 19వ తేదీ గురువారం చటోగ్రామ్‌లో ఫార్చ్యూన్ బరిషల్ వర్సెస్ రంగపూర్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బరిశాల్ తొలుత బ్యాటింగ్ చేసి కెప్టెన్, బంగ్లాదేశ్ సూపర్ స్టార్ షకీబ్ అల్ హసన్ 43 బంతుల్లో అజేయంగా 89 పరుగులు చేసి స్థానిక అభిమానులకు మాంచి ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మాత్రం పాకిస్థాన్ టీ20 జట్టులో భాగమైన పాకిస్థాన్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ ఇఫ్తికార్ అహ్మద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

45 బంతుల్లో సెంచరీ..

కేవలం 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన ఇఫ్తికార్.. షకీబ్‌తో కలిసి అజేయంగా 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును 238 పరుగుల స్కోరుకు చేర్చాడు. ఈ భాగస్వామ్య సమయంలో ఇఫ్తికార్ బౌలర్లపై భీకరమైన దాడి చేశాడు. పాక్ బ్యాట్స్‌మెన్ చివరి ఓవర్‌లో అదికూడా కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇఫ్తికార్ టీ20 కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం.

తన ఇన్నింగ్స్‌లో, ఇఫ్తికర్ ఫోర్లు, సిక్సర్ల సహాయంతో 78 పరుగులు చేశాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ మొత్తం 9 సిక్సర్లు కొట్టగా, అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు కూడా ఉన్నాయి.

రవూఫ్ కోహ్లీలా బాదేస్తాడు..

ఈ తుఫాన్ సెంచరీలో తన పాకిస్థానీ భాగస్వామి హరీస్‌ను చితక్కొట్టడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. 19వ ఓవర్ మూడు, నాలుగు, ఐదో బంతుల్లో ఇఫ్తికార్ వరుసగా 3 సిక్సర్లు బాదాడు. దాదాపు మూడు నెలల క్రితం విరాట్ కోహ్లీ కూడా 19వ ఓవర్‌లోనే వరుసగా రెండు సిక్సర్లు బాది హరీస్‌ను చావుదెద్ద తీశాడు. ఈ మ్యాచ్‌లో హరీస్ రవూఫ్ 42 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

238 పరుగుల భారీ స్కోర్ చేసిన తర్వాత, బరిషల్ తన విజయాన్ని భారీ స్థాయిలో నిర్ణయించుకుంది. మెహ్దీ హసన్ మిరాజ్ 3 వికెట్ల ఆధారంగా రంగ్‌పూర్‌ను కేవలం 171 పరుగులకే పరిమితం చేసి, 67 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..