కప్పంటూ ఒకరు.. ఆవుపేడలా మరొకరు.. అరంగేట్రంలోనే వేధింపులు.. కట్ చేస్తే.. 69 మ్యాచ్‌ల్లో 163 వికెట్లతో దుమ్మురేపిన బౌలర్..

పాల్ ఆడమ్స్ దక్షిణాఫ్రికా తరపున 45 టెస్టులు, 24 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 134 వికెట్లు తీశాడు. అదే సమయంలో వన్డేల్లో 29 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు.

కప్పంటూ ఒకరు.. ఆవుపేడలా మరొకరు.. అరంగేట్రంలోనే వేధింపులు.. కట్ చేస్తే.. 69 మ్యాచ్‌ల్లో 163 వికెట్లతో దుమ్మురేపిన బౌలర్..
On This Day In Cricket
Follow us
Venkata Chari

|

Updated on: Jan 20, 2023 | 9:59 AM

క్రికెట్ చరిత్రలో విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌లు ఉన్న ఎంతోమంది బౌలర్లు ఉన్నారు. అందులో పాల్ ఆడమ్స్‌కు ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమించి 19 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం.. జనవరి 20న అతని 46వ పుట్టినరోజు.

బౌలింగ్ యాక్షన్‌ కారణంగా ‘కప్ప’ పేరుతో..

1977 జనవరి 20న కేప్ టౌన్‌లో జన్మించిన పాల్ ఆడమ్స్ క్రికెట్ ఆడే రోజుల్లో బౌలింగ్ కంటే తన యాక్షన్‌తో అభిమానులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అతను 1995లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పుడు, మొదట్లో అతని యాక్షన్‌ని చూసి బ్యాట్స్‌మెన్స్ ఆశ్చర్యపోయారు. కానీ, బౌలింగ్‌లో వైవిధ్యం లేకపోవడంతో బాల్స్‌ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అతని అద్భుతమైన బౌలింగ్ యాక్షన్ చూసిన ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మైక్ గ్యాటింగ్ అతన్ని ‘ఫ్రాగ్ ఇన్ ఎ బ్లెండర్’ అని పిలిచాడు. ఆ తరువాత, ఆడమ్స్ ఫ్రాగ్ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే అతని బౌలింగ్ యాక్షన్ కారణంగా అతనికి ఈ పేరు వచ్చింది.

తోటి ఆటగాళ్లు ‘పేడ’ అంటూ..

దక్షిణాఫ్రికా జట్టులో ఆడమ్స్ అరంగేట్రం చేసినప్పుడు, అతను ఏకైక నల్లజాతి క్రికెటర్. అతని మొత్తం కెరీర్‌లో కూడా, జట్టులో దాదాపు ఒకే ఒక్క నల్లజాతి వ్యక్తిగా నిలిచాడు. అయితే, చర్మం రంగు ఆధారంగా వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. తోటి ఆటగాళ్లు తనను ఆవు పేడ అని పిలుస్తున్నారని ఓ సందర్భంలో ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

69 మ్యాచ్‌ల్లో 163 వికెట్లు..

పాల్ ఆడమ్స్ దక్షిణాఫ్రికా తరపున 9 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు. ఈ సమయంలో అతను 45 టెస్టులు, 24 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 134 వికెట్లు తీశాడు. అదే సమయంలో వన్డేల్లో 29 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. అంటే 69 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 163 ​​వికెట్లు తీశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..