SA vs IND: దటీజ్‌ కోహ్లీ.. ఎల్గర్‌కు అద్భుతమైన వీడ్కోలు పలికిన విరాట్‌.. ఏం చేశాడో మీరే చూడండి

సాధారణంగా వికెట్‌ పడితే విరాట్‌ కోహ్లీ సెలబ్రేషన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మ్యాచ్‌లో చివరి సారి బ్యాటింగ్‌ కు వచ్చి ఔటౌన తర్వాత ఎల్గర్‌ డగౌట్‌కు వెళుతున్నప్పుడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు అత్యుత్తమ వీడ్కోలిచ్చాడు విరాట్. దక్షిణాఫ్రికా సారథికి చేతులు వంచి నమస్కరించాలని గ్యాలరీలోని ప్రేక్షకులను కోరాడు.

SA vs IND: దటీజ్‌ కోహ్లీ.. ఎల్గర్‌కు అద్భుతమైన వీడ్కోలు పలికిన విరాట్‌.. ఏం చేశాడో మీరే చూడండి
Virat Kohli, Dean Elgar
Follow us
Basha Shek

|

Updated on: Jan 04, 2024 | 10:05 PM

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1 తో డ్రాగా ముగిసింది. మొదటి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఓటమి పాలు కాగా, తాజాగా కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ అంతకుమించిన విజయం అందుకుంది. ఆతిథ్య జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. కాగా ఈ సిరీస్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు డీన్‌ ఎల్గర్‌. ఈ విషయాన్ని సిరీస్‌ ముందే అధికారికంగా ప్రకటించాడు. ఇవాళ ఆఖరి టెస్ట్‌ ఆడిన ఎల్గర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ స్పెషల్‌ గిఫ్ట్స్ అందించారు. ముందుగా భార‌త జ‌ట్టు స‌భ్యులు సంత‌కాలు చేసిన జెర్సీని ఎల్గర్‌కు కానుక‌గా ఇచ్చాడు హిట్ మ్యాన్‌. అలాగే మ్యాచ్ అనంత‌రం విరాట్ కోహ్లీ.. ఎల్గర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే తాను సంత‌కం చేసిన‌ జెర్సీని జ్ఞాప‌కంగా అందించాడు. సాధారణంగా వికెట్‌ పడితే విరాట్‌ కోహ్లీ సెలబ్రేషన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మ్యాచ్‌లో చివరి సారి బ్యాటింగ్‌ కు వచ్చి ఔటౌన తర్వాత ఎల్గర్‌ డగౌట్‌కు వెళుతున్నప్పుడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు అత్యుత్తమ వీడ్కోలిచ్చాడు విరాట్. దక్షిణాఫ్రికా సారథికి చేతులు వంచి నమస్కరించాలని గ్యాలరీలోని ప్రేక్షకులను కోరాడు. అందుకే ఎల్గర్‌ క్యాచ్‌ పట్టినప్పటికీ ఎలాంటి సెలబ్రేషన్స్‌ చేసుకోలేదు. ఇలా ఆటతోనే కాదుత ప్రవర్తనతోనూ అందరి మనసులు గెల్చుకున్నాడు విరాట్‌ కోహ్లీ.

సెంచూరియన్ లో జరిగిన తొలి టెస్టుమ్యాచ్ లో 185 పరుగులు చేసి భారత ఓటమికి కారణమయ్యాడు ఎల్గర్‌. అయితే కేప్ టౌన్ లో జరిగిన తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో మాత్రం విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔటైన ఈ స్టార్ బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగులు చేసి ముఖేష్ కుమార్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున 84 టెస్టుల్లో 37.28 సగటుతో 5146 పరుగులు చేశాడు ఎల్గర్‌. ఇందులో 13 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 8 వన్డేలు మాత్రమే ఆడిన ఈ స్టార్ ఓపెనర్ కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు.

ఇవి కూడా చదవండి

డీన్ ఎల్గర్ కు టీమిండియా స్పెషల్ గిఫ్ట్స్..

నో సెలబ్రేషన్స్.. ఓన్లీ రెస్పెక్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..