IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్.. ఓటమి ఖాయం అంటోన్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
SA vs IND: టీమిండియా టెస్టు చరిత్రలో దక్షిణాఫ్రికాను వారి మైదానంలో ఎన్నడూ ఓడించలేదు. కాబట్టి ఓటమి అనే ముద్రను చెరిపేసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి రోహిత్ టీమ్ రంగంలోకి దిగుతోంది. అయితే ఈ రెండు మ్యాచ్‌లకు రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేయడం అభిమానులను నిరాశకు గురి చేసింది. దీంతో మరోమారు టీమిండియా రిక్తహస్తాలతోనే తిరుగుముఖం పట్టేలా ఉందంటూ బాధపడుతున్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు దక్షిణాఫ్రికా (India vs South Africa) వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు 3 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ (BCCI) ఇప్పటికే మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియా (Team India)ను ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు దక్షిణాఫ్రికా డిసెంబర్ 4న తమ జట్టును కూడా ప్రకటించింది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌తో టీమిండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత వన్డే సిరీస్. చివరగా డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
అంపైర్ల జాబితా ఇదే..
ఈ రెండు టెస్టుల సిరీస్‌కు అంపైర్ల పేర్లను కూడా ఐసీసీ ఇవాళ ప్రకటించింది. తొలి టెస్టు మ్యాచ్‌లో పాల్ రీఫిల్, రిచర్డ్ కెటిల్‌బరోలు అంపైర్లుగా వ్యవహరిస్తుండగా, రెండో టెస్టు మ్యాచ్‌లో రిచర్డ్ కెటిల్‌బరో-ఎహ్సాన్ రాజా అంపైర్లుగా వ్యవహరిస్తారు. ఈ అంపైర్ల జాబితా వెలువడిన తర్వాత టీమిండియా అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో.
ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు..
Umpires for India vs South Africa Test series. [TOI]
1st Test – Paul Reiffel and Richard Kettleborough
2nd Test – Richard Kettleborough and Ahsan Raza pic.twitter.com/QNBF6oxZ6R
— Johns. (@CricCrazyJohns) December 4, 2023
టెస్టు చరిత్రలో దక్షిణాఫ్రికాను టీమిండియా వారి మైదానంలో ఓడించలేదు. అంటే, ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో భారత్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. కాబట్టి, ఓటమి అనే ముద్రను చెరిపేసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి రోహిత్ టీమ్ రంగంలోకి దిగుతోంది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లకు రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేయడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.
రిచర్డ్ కెటిల్‌బరో vs టీమ్ ఇండియా..
Yeh Richard Kettleborough kab retire hone wala hai? Any idea? 🤯🤦 pic.twitter.com/AD2xhpMMDP
— CricWiz (@CricWizTalks) December 4, 2023
నిజం చెప్పాలంటే, యాదృచ్ఛికంగా రిచర్డ్ కెటిల్‌బరో టీమ్ ఇండియా ఓడిపోయిన పెద్ద టోర్నమెంట్‌లకు అంపైర్‌గా ఉంటున్నాడు. 2014 నుంచి ఈ పరాజయాల పరంపర మొదలైంది. 2023 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా ఓటమికి ముందు, 2014 ప్రపంచ కప్ ఫైనల్, 2015 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2016 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2017 ప్రపంచ కప్ ఫైనల్, 2017 ప్రపంచ కప్ ఫైనల్‌లలో భారత్ ఓటములకు కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో రిచర్డ్ టీమ్ ఇండియాకు అంపైరింగ్‌గా ఉన్నాడు.
అభిమానుల్లో ఆందోళనలు..
Indians To Richard Kettleborough pic.twitter.com/ATogaglMdw
— Aufridi Chumtya (@ShuhidAufridi) December 4, 2023
రిచర్డ్ మళ్లీ అంపైర్‌గా కనిపించడం 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓటమిని మరచిపోవాలని ప్రయత్నిస్తున్న అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఇలా సోషల్ మీడియాలో రిచర్డ్ అంపైరింగ్ గురించి మీమ్స్ వెల్లువెత్తాయి.
రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేయడం వల్లే భారత్ మ్యాచ్‌లు ఓడిపోతోందని చెప్పడం తప్పు. ఎందుకంటే మ్యాచ్‌లో గెలుపు లేదా ఓటము అనేది జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది.
సిరీస్ షెడ్యూల్ ఇదే..
Indians to Richard Kettleborough pic.twitter.com/mTJc8qbusv
— Akshay Rana 🇮🇳🚩🚩 ( सनातनी ) (@RanaAp10) December 4, 2023
టెస్టు సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. డిసెంబర్ 10 నుంచి 21 వరకు వన్డే, టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 26న సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఆ తర్వాత జనవరి 3న కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








