IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌.. అరంగేట్రం చేసేందుకు సిద్ధమైన ఇద్దరు యువ ఆటగాళ్లు?

Indian Cricket Team: వెస్టిండీస్‌తో భారత జట్టు 2-టెస్టుల సిరీస్ ఆడనుంది. అదే సమయంలో ఈ సిరీస్‌లో రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లు అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. IPL 2023లో గైక్వాడ్, జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌లతో అదరగొట్టారు.

IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌.. అరంగేట్రం చేసేందుకు సిద్ధమైన ఇద్దరు యువ ఆటగాళ్లు?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Jun 20, 2023 | 7:39 AM

Yashasvi Jaiswal, Ruturaj Gaikwad: వెస్టిండీస్‌తో భారత జట్టు 2-టెస్టుల సిరీస్ ఆడనుంది. అదే సమయంలో ఈ సిరీస్‌లో రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లు అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. IPL 2023లో గైక్వాడ్, జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌లతో అదరగొట్టారు. అంతే కాకుండా దేశవాళీ మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లిద్దరూ అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొట్టిన రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌..

యశస్వి జైస్వాల్ IPL 2023లో రాజస్థాన్ రాయల్స్‌ తరపున బరిలోకి దిగాడు. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున రితురాజ్ గైక్వాడ్ ఆడాడు. ఈ యువ ఆటగాళ్లు కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. అదే సమయంలో, కరీబియన్ టూర్‌లో రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లను ప్రయత్నించాలని మాజీలు కూడా సూచనలు ఇస్తున్నారు. భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డొమినికాలో జరగనుండగా, రెండో టెస్టు ట్రినిడాడ్‌లో జరగనుంది.

ఛెతేశ్వర్ పుజారా స్థానంలో యశస్వి జైస్వాల్‌కి ఛాన్స్..!

వెస్టిండీస్‌తో సిరీస్‌లో చెతేశ్వర్ పుజారా స్థానంలో యశస్వి జైస్వాల్‌ని ప్రయత్నించవచ్చని అంటున్నారు. అదే సమయంలో పుజారా జట్టులో చోటు దక్కించుకున్నా.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడే అవకాశం దక్కుతుందన్న గ్యారెంటీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వవచ్చని అంటున్నారు. విశేషమేమిటంటే, భారత్-వెస్టిండీస్ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ డొమినికాలో జరగనుండగా, సిరీస్‌లోని రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లు ట్రినిడాడ్‌లో తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..