Watch Video: అన్‌స్టాపబుల్ ఎనర్జీ.. 10 బంతుల్లో హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా..!

మ్యాచ్‌లు మారుతాయి.. ప్రత్యర్థులు మారతారు.. మైదానాలు కూడా మారిపోయాయి.. కానీ సాయి సుదర్శన్ తుఫాన్ స్టైల్ మాత్రం మారలేదు. సుదర్శన్ తన అన్‌స్టాపబుల్ ఎనర్జీతో వరుస హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సాయి సుదర్శన్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు కొట్టాడు.

Watch Video: అన్‌స్టాపబుల్ ఎనర్జీ.. 10 బంతుల్లో హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా..!
Sai Sudharshan
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 20, 2023 | 12:02 PM

మ్యాచ్‌లు మారుతాయి.. ప్రత్యర్థులు మారతారు.. మైదానాలు కూడా మారిపోయాయి.. కానీ సాయి సుదర్శన్ తుఫాన్ స్టైల్ మాత్రం మారలేదు. సుదర్శన్ తన అన్‌స్టాపబుల్ ఎనర్జీతో వరుస హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సాయి సుదర్శన్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఈ లీగ్‌లో ఎవరిదైనా పేరు చాలా బలంగా వినిపిస్తుందంటే.. అది సాయి సుదర్శన్‌దే అని చెప్పాలి.

తమిళనాడు ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు సాయి సుదర్శన్ 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆడిన మూడింటిలోనూ సుదర్శన్ ఒకే విధంగా ఫర్ఫార్మెన్స్ చేశాడు. ప్రతి మ్యాచ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించాడు. అహ్మదాబాద్ నుండి కోయంబత్తూరు వరకు, కోయంబత్తూర్ నుండి దిండిగల్ వరకు, సాయి సుదర్శన్ ప్రతిచోటా తన మార్క్ బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

అన్‌స్టాపబుల్‌ సాయి సుదర్శన్..

21 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్.. తాజా మ్యాచ్‌లో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ సాధించాడు. లైకా కోవై కింగ్స్, చెపాక్ సూపర్ గిల్లీస్ మధ్య మ్యాచ్ జరిగింది. కోవై కింగ్స్ తరఫున 3వ స్థానంలో క్రీజులోకి వచ్చిన సుదర్శన్.. 10 బందుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక మొత్తంగా 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 43 బంతుల్లో 64 పరుగులు చేశాడు.

వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ..

సాయి సుదర్శన్‌కి ఇది వరుసగా నాలుగో టీ20 హాఫ్ సెంచరీ. టీఎన్‌పీఎల్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ. సాయి ఇప్పటి వరకు టీఎన్‌పీఎల్‌లో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మూడింటిలోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. అంతకుముందు ఐపీఎల్ 2023 ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.

కోవై కింగ్స్ విజయం..

సాయి సుదర్శన్ అజేయమైన హాఫ్ సెంచరీతో చెపాక్ సూపర్‌ టీమ్‌పై కోవై కింగ్స్ టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మరిన్ని క్రికెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!