Video: వామ్మో.. గాల్లో ఎగురుతూ.. ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..

Romario Shepherd Catch Video: ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హెన్రిక్ క్లాసెన్ (64) డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున హాఫ్ సెంచరీ చేశాడు. ఈ హాఫ్ సెంచరీ సాయంతో డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించిన జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు డర్బన్ బౌలర్ల సమిష్టి ధాటికి తడబడింది. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Video: వామ్మో.. గాల్లో ఎగురుతూ.. ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..
Romario Shepherd Catch Vide
Follow us
Venkata Chari

|

Updated on: Jan 16, 2024 | 3:59 PM

Durban Super Giants vs Joburg Super Kings: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్ ఉత్కంఠ పోరుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ వైపు బ్యాటర్లు రెచ్చిపోతుంటే, మరోవైపు బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు ఫీల్డర్లు తమ అద్భుత ఫీల్డింగ్ ద్వారా మ్యాచ్ గమనాన్ని మార్చేస్తున్నారు. ఇలా ప్రతి విభాగం నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి పోటీ మధ్య రొమారియో షెపర్డ్ కొత్త సంచలనం సృష్టించాడు. అది కూడా గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకోవడం విశేషం.

ఈ టోర్నీలో 7వ మ్యాచ్‌లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. డర్బన్ కెప్టెన్ కేశవ్ మహరాజ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్ జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ క్వింటన్ డి కాక్ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

అయితే, మరోవైపు మాథ్యూ బ్రీట్జ్కీ ధాటిగే ఆడే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో నాండ్రే బెర్గర్ వేసిన 4వ ఓవర్ 5వ బంతికి బ్రీట్జ్కీ ఫ్లిక్ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రొమారియో షెఫర్డ్ షార్ట్ మిడ్ వికెట్ వైపు గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ప్రస్తుతం రొమోరియో షెపర్డ్ గాలిలో ఎగురుతూ క్యాచ్ పట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే, విండీస్‌ క్రికెటర్‌ అద్భుత ఫీల్డింగ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఓడిపోయిన సూపర్ కింగ్స్..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హెన్రిక్ క్లాసెన్ (64) డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున హాఫ్ సెంచరీ చేశాడు. ఈ హాఫ్ సెంచరీ సాయంతో డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.

ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించిన జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు డర్బన్ బౌలర్ల సమిష్టి ధాటికి తడబడింది. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

డర్బన్ సూపర్‌జెయింట్‌ ప్లేయింగ్ 11: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మాథ్యూ బ్రెయిట్జ్కీ, జెజె స్మట్స్, నికోలస్ పూరన్, హెన్రిక్ క్లాసెన్, కీమో పాల్, వియాన్ ముల్డర్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), రిచర్డ్ గ్లీసన్, రీస్ టోప్లీసన్.

జోబర్గ్ సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రోనన్ హెర్మన్ (వికెట్ కీపర్), లూయిస్ డు ప్లూయ్, మొయిన్ అలీ, డొనోవన్ ఫెరీరా, డేవిడ్ వీజా, రొమారియో షెపర్డ్, లిజార్డ్ విలియమ్స్, నాండ్రే బెర్గర్, ఇమ్రాన్ తాహిర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..