Video: ఇదెక్కడి రియాక్షన్ రోహిత్ భయ్యా.. ఊహించని తీర్పు రావడంతో ఏం చేశాడంటే..? వైరల్ వీడియో

IND vs BAN: డీఆర్ఎస్ తీర్పు భారత్‌కు అనుకూలంగా వస్తుందని అప్పటి వరకు ఆకాశ్ దీప్ తప్ప జట్టులోని మరే ఆటగాడు అనుకోలేదు. స్వయంగా కెప్టెన్ రోహిత్ కూడా నమ్మలేదు. అయితే డీఆర్‌ఎస్‌లో ఔట్ అని నిర్ధారించిన తర్వాత ఆటగాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కెప్టెన్ రోహిత్ కూడా ఆకాశ్ దీప్ వికెట్ పడటంతో కౌగిలించుకుని సంబరాలు చేసుకున్నాడు.

Video: ఇదెక్కడి రియాక్షన్ రోహిత్ భయ్యా.. ఊహించని తీర్పు రావడంతో ఏం చేశాడంటే..? వైరల్ వీడియో
Rohit Sharma
Follow us

|

Updated on: Sep 27, 2024 | 5:04 PM

IND vs BAN: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా బౌలింగ్‌ను ఆరంభించిన అనుభవజ్ఞులైన జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు ఆరంభంలో వికెట్లు దక్కలేదు. కాబట్టి బౌలింగ్‌లో మార్పు చేయాలని భావించిన జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. యువ బౌలర్ ఆకాశ్ దీప్‌కి బౌలింగ్ ఇచ్చాడు. ఈ సమయంలో బరిలోకి దిగిన ఆకాశ్.. బంగ్లాదేశ్ జట్టులోని ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా ఆకాష్ రెండో వికెట్ కెప్టెన్ రోహిత్ శర్మను ఆశ్చర్యపరిచింది.

ఆకాశ్‌కు 2 వికెట్లు..

ఈ మ్యాచ్‌లో తొలి ఎనిమిది ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు వికెట్లు తీయలేకపోయారు. ఇంతలో కెప్టెన్ రోహిత్, ఆకాష్ బౌలింగ్‌ చేయాలని సూచించాడు. ఈక్రమంలో ఆకాష్ తన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ జకీర్ హసన్‌ను అవుట్ చేశాడు. జకీర్ సరిగ్గా 24 బంతులు ఎదుర్కొన్నా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ సద్మాన్ ఇస్లామ్ ఆకాష్ ఎల్బీకి చిక్కాడు.

ఇవి కూడా చదవండి

ఓపెనర్లిద్దరూ ఔట్..

ఆకాశ్‌ దీప్‌ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతి బంగ్లాదేశ్‌ మరో ఓపెనర్‌ సద్‌మాన్‌ ఇస్మాల్‌ ప్యాడ్‌లకు తగిలింది. అందుకే, టీమిండియా ఆటగాళ్లు అంపైర్‌కు విజ్ఞప్తి చేసినా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఆకాష్ దీప్ ఔట్ కావడం ఖాయమని తెలిసి కెప్టెన్ రోహిత్‌ను డీఆర్‌ఎస్ తీసుకోవాలని కోరాడు. కాసేపు ఆలోచించిన రోహిత్ ఎట్టకేలకు డీఆర్ఎస్ తీసుకున్నాడు. డీఆర్‌ఎస్‌ చూడగానే ఇస్మాయిల్‌ ఔట్‌ అయినట్లు నిర్ధారణ అయింది.

ఆశ్చర్యపోయాడు రోహిత్..

డీఆర్ఎస్ తీర్పు భారత్‌కు అనుకూలంగా వస్తుందని అప్పటి వరకు ఆకాశ్ దీప్ తప్ప జట్టులోని మరే ఆటగాడు అనుకోలేదు. స్వయంగా కెప్టెన్ రోహిత్ కూడా నమ్మలేదు. అయితే డీఆర్‌ఎస్‌లో ఔట్ అని నిర్ధారించిన తర్వాత ఆటగాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కెప్టెన్ రోహిత్ కూడా ఆకాశ్ దీప్ వికెట్ పడటంతో కౌగిలించుకుని సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..