AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : బొక్క బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. నడవలేక కింద పడిపోయాడా? .. నెట్టింట్లో వీడియో వైరల్

Rohit Sharma : వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక బేస్‌మెంట్ లాంటి ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్న రోహిత్.. కింద ఉన్న ఒక అడ్డును గమనించకుండా బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా ముఖంపై బోర్లా పడిపోయాడు.

Video : బొక్క బోర్లా పడ్డ  రోహిత్ శర్మ.. నడవలేక కింద పడిపోయాడా? .. నెట్టింట్లో వీడియో వైరల్
Team India
Rakesh
|

Updated on: Jun 03, 2026 | 3:04 PM

Share

Video : ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి భారత అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌పై పడింది. జూన్ 6 నుంచి చండీగఢ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనుంది. దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించబోతున్నారు. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక బేస్‌మెంట్ లాంటి ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్న రోహిత్.. కింద ఉన్న ఒక అడ్డును గమనించకుండా బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా ముఖంపై బోర్లా పడిపోయాడు.

ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్ ఆందోళన

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు జరిగిన సంఘటన లేక పాత వీడియోనా అనేదానిపై స్పష్టమైన అధికారిక సమాచారం లేదు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో దాదాపు సగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని ఫిట్‌నెస్ ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఒకవేళ ఇది తాజా వీడియోనే అయితే, ముంబై టీ20 లీగ్ 2026 ప్రారంభోత్సవానికి రోహిత్ బ్రాండ్ అంబాసిడర్‌గా వెళ్లినప్పుడు జరిగి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. గాయం ఉన్నప్పటికీ ఐపీఎల్‌లో కోల్‌కతా, లక్నోలపై రోహిత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన రోహిత్ ఎంపిక

ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో కూడిన బలమైన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే 39 ఏళ్ల రోహిత్ శర్మను వన్డే జట్టులోకి ఎంపిక చేయడం జాతీయ సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారినట్లు సమాచారం. ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు గాయం కారణంగా ఆడకపోవడంతో అతని మ్యాచ్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు.

2027 వరల్డ్ కప్ ప్లాన్స్ లో హిట్ మ్యాన్ లేడా?

వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ రోహిత్ శర్మ ఈ దశాబ్దంలో భారతదేశం తరఫున అత్యుత్తమ బ్యాటర్‌గా రాణించాడు. 2020 నుంచి అన్ని ఫార్మాట్లలో కలిపి 151 ఇన్నింగ్స్‌లలో 6391 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గా భారత్‌కు 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని అందించి ఐసీసీ ట్రోఫీల కరవును తీర్చాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తర్వాత కూడా రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేసే క్రమంలో బీసీసీఐ యువ కెప్టెన్ల వైపు మొగ్గు చూపుతోంది. అంతర్గత నివేదికల ప్రకారం 2027 వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు లేనట్లు తెలుస్తోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us