
Rohit Sharma vs Virat Kohli: ఐపీఎల్ టోర్నీలో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి చర్చ జరుగుతోంది. అతను ఎక్కువ పరుగులు చేసినప్పటికీ, కోహ్లీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రోహిత్ శర్మను కూడా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి అతను నవ్వాను ఆపుకోలేకపోయాడు. కోహ్లీ ఎంపికపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి రోహిత్ శర్మను ఒక ప్రశ్న అడగగా ఎటువంటి ప్రకటన చేయకుండా నవ్వుతూనే ఉన్నాడు. అయితే, అజిత్ అగార్కర్ తరువాత విరాట్ కోహ్లీని ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ ఐపిఎల్‌లో బాగా రాణిస్తున్నాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై మేం ఎప్పుడూ ప్రశ్నలు లేవనెత్తలేదంటూ చెప్పుకొచ్చాడు.
2024 T-20 ప్రపంచ కప్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు వెస్టిండీస్, అమెరికా మధ్య జరుగుతుంది. ఇందుకోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును టీమిండియా ప్రకటించింది. ఈ ఎంపికపై స్పష్టత ఇచ్చేందుకు అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
🗣️🗣️ One thing we really looked at was our middle-overs hitting. #TeamIndia Captain Rohit Sharma on the batting options and combinations for the #T20WorldCup@ImRo45 pic.twitter.com/JmHqSZZt9L
— BCCI (@BCCI) May 2, 2024
విలేకరుల సమావేశంలో, కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి రోహిత్‌ను అడిగారు. దీంతో రోహిత్ శర్మ నవ్వుకున్నాడు. 2021లో విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్‌ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగిస్తారా అని కోహ్లిని మీడియా ప్రశ్నించింది. అప్పుడు కోహ్లీ పెద్దగా నవ్వాడు. రోహిత్ కూడా అలాగే నవ్వుతూ కనిపించడం విశేషం. దీంతో అభిమానులు ఆ రెండు సందర్భాలను పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
దీనిపై అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చారు. “విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ చర్చకు రాదని నేను అనుకోను. మేం అంతర్జాతీయ క్రికెట్ ఆడతాం. ఐపీఎల్‌కి ఈ క్రికెట్‌కు తేడా ఉంది. ఇది తెలుసుకుని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అనుభవం ముఖ్యం’ అంటూ అజిత్ అన్నారు.
ఐపీఎల్ లాంటి టోర్నీలో 220 స్కోరు సాధారణం. అయితే, ప్రపంచకప్ విషయానికి వస్తే ఒత్తిడి వేరుగా ఉంటుందని చెప్పాడు. దీంతో అన్ని విషయాలపై స్పష్టత వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..