AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CEAT అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రోహిత్ శర్మ.. ఏ అవార్డ్‌ దక్కించుకున్నాడో తెలుసా?

CEAT Cricket Awards: ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, ఛాంపియన్స్ ట్రోఫీ విజయం వెనుక మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలంలో చేసిన ప్రయోగాలే కారణమని పేర్కొన్నాడు. ఈ పద్ధతులను జట్టు సభ్యులంతా నమ్మడం వల్లే విజయం సాధ్యమైందని హిట్ మ్యాన్ స్పష్టం చేశారు.

CEAT అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రోహిత్ శర్మ.. ఏ అవార్డ్‌ దక్కించుకున్నాడో తెలుసా?
Ceat Awards Rohit Sharma
Venkata Chari
|

Updated on: Oct 08, 2025 | 10:22 AM

Share

CEAT Cricket Awards: ప్రతిష్ఠాత్మకమైన 27వ CEAT క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డ్స్ వేడుక ఇటీవల ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లను ఈ వేదికపై సన్మానించారు. ఈసారి అవార్డుల్లో భారత ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ వంటి క్రికెటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

రోహిత్ శర్మకు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రత్యేక సన్మానం..

భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ వేడుకలో ముఖ్య కేంద్రంగా నిలిచారు. ఇటీవల భారత్ సాధించిన రెండు వరుస ఐసీసీ టైటిల్స్‌లో (2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ) ఆయన అందించిన నాయకత్వానికి గాను, ఛాంపియన్స్ ట్రోఫీ విజయం కోసం ఆయనకు ఒక ప్రత్యేక జ్ఞాపిక (Special Memento)ను అందించారు.

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, ఛాంపియన్స్ ట్రోఫీ విజయం వెనుక మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలంలో చేసిన ప్రయోగాలే కారణమని పేర్కొన్నాడు. ఈ పద్ధతులను జట్టు సభ్యులంతా నమ్మడం వల్లే విజయం సాధ్యమైందని హిట్ మ్యాన్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

సంజు, వరుణ్, శ్రేయస్‌ల సత్తా..!

భారత టీ20 స్పెషలిస్టులు సంజు శాంసన్ (Sanju Samson), వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) పొట్టి ఫార్మాట్‌లో తమ అద్భుత ప్రదర్శనకు గాను అత్యుత్తమ అవార్డులను అందుకున్నారు.

సంజు శాంసన్ మెన్స్ టీ20ఐ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ (Men’s T20I Batter Of The Year) అవార్డును గెలుచుకున్నారు. ఆసియా కప్‌లో మెరిసిన అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లను సైతం వెనక్కి నెట్టి సంజు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మెన్స్ టీ20ఐ బౌలర్ ఆఫ్ ది ఇయర్ (Men’s T20I Bowler Of The Year) అవార్డును దక్కించుకున్నారు.

భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) CEAT జియోస్టార్ అవార్డును (CEAT JioStar Award) అందుకున్నారు.

ఇంగ్లాండ్ ఆటగాళ్లకూ పురస్కారాలు..

అంతర్జాతీయ క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకున్న విదేశీ క్రికెటర్లు కూడా ఈ అవార్డులలో మెరిశారు.

ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ (Joe Root) ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (International Cricketer Of The Year) అవార్డును గెలుచుకున్నాడు.

విండీస్ లెజెండ్ బ్రెయాన్ లారా (Brian Lara) కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (Lifetime Achievement Award) లభించింది.

న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ ‘మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును, మ్యాట్ హెన్రీ ‘మెన్స్ వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు.

డొమెస్టిక్, ఇతర అవార్డుల విజేతలు..

దేశీయ క్రికెట్‌లో నిలకడగా రాణించిన ఆటగాళ్లను, మహిళా క్రికెటర్లను కూడా ఈ వేదికపై సత్కరించారు.

హర్ష్ దూబే (Harsh Dubey) CEAT డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (CEAT Domestic Cricketer of the Year) అవార్డును గెలుచుకున్నారు.

ఉమెన్స్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ – స్మృతి మంధాన

ఉమెన్స్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ – దీప్తి శర్మ

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – అంగ్క్రిష్ రఘువంశీ

టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – హ్యారీ బ్రూక్

ఎగ్జాంపులరీ లీడర్‌షిప్ అవార్డు – టెంబా బవుమా

CEAT లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – బి.ఎస్. చంద్రశేఖర్

క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఈ CEAT అవార్డులు అదనపు ప్రోత్సాహాన్ని అందించాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..