Video: చాలా బాధ అనిపించింది..! సెంచరీ తర్వాత తొలిసారి నోరు విప్పిన రోహిత్ శర్మ
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ, తన రిటైర్మెంట్‌పై వస్తున్న పుకార్లకు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం కూడా అలాంటి ప్రచారాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశాడు. భారత్ ఓడినప్పటికీ రోహిత్ ఇన్నింగ్స్, అతని వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో దుమ్ము లేపాడు. ఇదే రోహిత్‌కు చివరి మ్యాచ్ అంటూ చాలా పుకార్లు వచ్చాయి. పూర్ ఫామ్, ఏజ్ కారణంగా అతన్ని జట్టును తప్పిస్తామని సెలెక్టర్లు ఇప్పటికే రోహిత్‌కి చెప్పేసినట్లు, 2027 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో రోహిత్ ఉండడని, అందుకే రోహిత్ శర్మను రిటైర్ అవ్వాల్సింది సెలెక్టర్లు అతనికి చెప్పేసినట్లు చాలా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రోహిత్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కానీ, తనపై వచ్చిన పుకార్లకు రోహిత్ శర్మ బ్యాట్‌తో సమాధానం చెప్పాడు.
ఇది కూడా చదవండి: రోహిత్ కెరీర్‌ను రక్షించిన బ్యాట్ ఎవరిదో తెలుసా? అతను అదృష్టానికి మారుపేరు..!
తన ఏజ్, ఫిట్ నెస్‌ను ప్రశ్నించిన వాళ్లకు తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో బదులిచ్చాడు, అలాగే తన ఫామ్‌ను క్వశ్చన్ చేసిన వారికి సూపర్ సెంచరీతో చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చాడు. మొత్తానికి తాను రిటైర్ అవ్వడం లేదనే విషయాన్ని బ్రహ్మాండం బద్దలయ్యేలా చాటా చెప్పాడు. ముందు బ్యాట్‌తో సమాధానం చెప్పిన రోహిత్ శర్మ.. సెంచరీ తర్వాత నోటితో కూడా బదులిచ్చాడు. తనపై వచ్చిన రిటైర్మెంట్ పుకార్లను తాను పట్టించుకోవడం లేదని, వాళ్లని మాట్లాడటం, నా పని ఆడటం అంతే. వాళ్లు బయటి నుంచి ఎన్నో చెప్తాను, నేను లోపల(గ్రౌండ్) ఆడుతూ ఉంటాను, ఇలాంటి నాయిస్ కామన్, అది ఒక రకంగా ఫన్ అంటూ సరదాగా తీసుకున్నాడు.
ఇది కూడా చదవండి: రిటైర్ అవ్వమన్నారు.. వరల్డ్ రికార్డ్‌తో బదులిచ్చాడు! ప్రపంచ క్రికెట్‌లో నెం.1గా రోహిత్ శర్మ
అలాగే మ్యాచ్ ఓడిపోవడంపై స్పందిస్తూ.. కాస్త బాధ అనిపించింది అని రోహిత్ పేర్కొన్నాడు. అంతమంచి బ్యాటింగ్ చేసి ఓడిపోవడం కాస్త నిరాశగా అనిపించింది, బ్యాటింగ్‌లో 20, 30 రన్స్ షార్ట్ అయిపోయాం, మా బౌలర్లకు ఇక్కడి కండీషన్స్‌లో ఆడిన అనుభవం పెద్దగా లేదు, వాళ్లను తప్పుబట్టలేం అని అన్నాడు. అలాగే విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం కూడా చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. రిజల్ట్ తమకు అనుకూలంగా రాకపోవడం కాస్త నిరాశ పరిచినట్లు రోహిత్ పేర్కొన్నాడు. మ్యాచ్ తర్వాత రోహిత్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మీరు కూడా ఆ వీడియో చూడాలనుకుంటే.. కింద ఉన్న బీసీసీఐ పోస్ట్‌పై క్లిక్ చేసి చూసేయొచ్చు.
He was the most-talked about cricketer before the Lord’s ODI and he still remains the most-talked about after his scintillating hundred 🙌
🎥 Hear from the man himself as he soaked everything in to produce a masterclass 🫡 – By @RajalArora #TeamIndia | @ImRo45…
— BCCI (@BCCI) July 20, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
