AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిటైర్ అవ్వమన్నారు.. వరల్డ్ రికార్డ్‌తో బదులిచ్చాడు! ప్రపంచ క్రికెట్‌లో నెం.1గా రోహిత్ శర్మ

రోహిత్ శర్మ లార్డ్స్‌లో జరిగిన వన్డేలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా నిలిచాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

రిటైర్ అవ్వమన్నారు.. వరల్డ్ రికార్డ్‌తో బదులిచ్చాడు! ప్రపంచ క్రికెట్‌లో నెం.1గా రోహిత్ శర్మ
Rohit Sharma
SN Pasha
|

Updated on: Jul 20, 2026 | 6:00 AM

Share

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కొత్త చరిత్ర లిఖించాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు.

తన బ్రాండ్ పుల్ షాట్లతో అదరగొట్టిన రోహిత్.. ఓ భారీ సిక్స్‌తో ప్రపంచ రికార్డును బద్దులుకొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డును బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 342 సిక్సుల రికార్డును తాజాగా రోహిత్ శర్మ అధిగమించాడు.

గేల్ సెనా దేశాలపై మొత్తం 342 సిక్సులు కొట్టగా.. ఇప్పుడు రోహిత్ శర్మ 343 సిక్సులతో ఈ దేశాలపై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ సెనా దేశాలపై ఇలాంటి రికార్డు కలిగి ఉండటం చిన్న విషయం కాదు. ప్రపంచ క్రికెట్‌లో పటిష్టమైన టీమ్స్‌లో ఈ టీమ్స్ ముందు వరుసలో ఉంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. అలాంటి టీమ్స్‌పై ఇన్ని సిక్సులు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. పైగా ఈ టీమ్స్‌పై అన్ని సిక్సులు కొట్టిన బ్యాటరే లేడు. తొలి సారి రోహిత్ ఆ రికార్డు సాధించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us